అడ్డాల నాడు బిడ్డలు గాని, గెడ్డాలు నాడు బిడ్డలు కాదని అంటూ ఉంటారు. అయితే ఈ సామెత ఇప్పటివరకు చాలా సార్లు మగవాళ్ళ విషయంలోనే నిజమైతే, ఇప్పుడు ఆడవాళ్ళ విషయంలో కూడా అది నిరూపితం అవుతుంది అని తెలుస్తుంది‌. మొన్న హత్య చేయబడిన అప్సర ఉదంతం ఈ విషయాన్ని చాటి చెప్తుంది. ఒక తండ్రి తాను పగలు రాత్రి కష్టపడి తన కుటుంబాన్ని పైకి తీసుకురావాలని పనిచేస్తూ ఉంటాడు.


వాళ్లకి గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడానికి కష్టపడుతూ ఉంటాడు. అలాగే ఒక తల్లి  రోజంతా శ్రమిస్తూ ఇంటిని చూసుకుంటూ వాళ్లకి కావాల్సిన ఆహారాన్ని సిద్ధం చేస్తూ వాళ్ల అవసరాలు  తీరుస్తూ ఉంటుంది. ఒక తల్లి అయినా, ఒక తండ్రి అయినా వాళ్లు ఏది చెప్పినా, ఏం చేసినా అంతా పిల్లల మంచి కోసమే అయి ఉంటుంది. కానీ అప్సర విషయంలో ఇద్దరు పిల్లల తండ్రి తన కూతురు దగ్గరికి వచ్చి వెళ్తున్నా సరే కూతుర్ని ఇది ఏంటని అడగలేక పోయింది.


దాని ఫలితంగా ఇప్పుడు అది కాస్త శారీరక సంబంధంగా, అక్రమ సంబంధంగా మారి తన కూతురి మరణం వరకు తీసుకు వచ్చింది. తన కన్న కూతురు ఏం చేస్తుందో, ఎవరితో వెళ్తుందో ముందు గమనించకుండా  తన కూతురు అప్సర చనిపోయిన తర్వాత ఇప్పుడు బాధపడుతుంది. తన కూతురికి ఏమీ తెలియదని, తన కూతుర్ని అన్యాయంగా చంపేశారని ఇప్పుడు బాధపడుతుంది. ఈ సంఘటన ఆమెకు పుత్రికా శోకాన్ని మిగిల్చింది అని తెలుస్తుంది.


మరొక పక్కన ఆల్రెడీ వివాహం అయ్యి పిల్లలు కూడా ఉన్న సాయి కృష్ణ అర్చక వృత్తిలో ఉంటూ కూడా, అప్సర తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుస్తుంది‌. అది మాత్రమే కాకుండా ఇప్పుడు అప్సర పెళ్లి చేసుకోమంటుంది అనే కారణంతో ఆమెను కిరాతకంగా చంపడం ద్వారా తన వృత్తి గౌరవాన్ని, కుటుంబ గౌరవాన్ని, సాయి కృష్ణ పోగొట్టుకున్నాడని ఇప్పుడు చాలా మంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: