ఇటీవల కాలంలో ఢిల్లీ మెట్రో తరుచు వార్తల్లో నిలుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ కష్టాలను తగ్గించి ఎలాంటి అంతరాయం లేకుండా అత్యంత వేగం గా గమ్యస్థానాలకు చేరే విధంగా మెట్రోని అందుబాటు లోకి తీసుకువచ్చారు. కానీ ప్రస్తుతం మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులు చిత్ర విచిత్రం గా ప్రవర్తిస్తూ ఉండడం మాత్రం సంచలనం గా మారి పోతుంది అని చెప్పాలి..



 సోషల్ మీడియా లో క్రేజ్ సంపాదించాలని అనుకునేవారు. ఇక మెట్రోలో పిచ్చి పనులు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తున్నారు.  ఇలాంటి వీడియోలు ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అనడంలో సందేహం లేదు. కొంతమంది మెట్రోలో డాన్సులు వేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తుంటే.. మరి కొంతమంది ఏకంగా రొమాన్స్ తో రెచ్చిపోతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాము. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే వెలుగులోకి వచ్చింది.



 మెట్రోలో ప్రయాణిస్తున్న సమయం లో ఇక్కడ ఒక మహిళ చేసిన పని కాస్త అందని అవాక్కయ్యేలా చేస్తూ ఉంది అనడం లో సందేహం లేదు. సాధారణం గానే మహిళలు ఛాన్స్ దొరికింది అంటే చాలు ఇక మేకప్ బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక అమ్మాయి అదే చేసింది. ఏకంగా మెట్రో ట్రైన్ లో హెయిర్ స్ట్రెయిట్నర్ తో తన జుట్టును సరి చేసుకుంది. మెట్రో ట్రైన్ లో ఉండే ఛార్జింగ్ కేస్ కు హెయిర్ స్ట్రెయిట్నర్ ప్లగ్ పెట్టింది. పిచ్చి పిచ్చిగా ఉన్న తన జుట్టును ఇక హెయిర్ స్టయిల్ తో సవరించుకుంది. ఇది చూసి తోటి ప్రయాణికులు షాక్ కు గురయ్యారు. వెంటనే వీడియో తీసి ట్విట్టర్లో  పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి నేటిజన్స్  షాక్ అవుతున్నారు. ఇలాంటి ప్రయాణికులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: