సాధారణంగా అమ్మాయిలు అందంగా కనిపించడానికి చేసే పనులు కొన్ని కొన్ని సార్లు వింతగా అనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు ముఖానికి ఏదో ఒకటి రాసుకుంటూ తమ అందాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే డబ్బున్న వారు అయితే కోట్ల రూపాయలు పెట్టి ఇక ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని తమ ముఖంలోని భాగాలను తమకు నచ్చినట్లుగా మార్చుకోగలరు. కానీ సామాన్యులకు అది సాధ్యం కాదు. ఎందుకంటే అంత ఖర్చు చేయలేరు కాబట్టి.


 ఈ క్రమంలోనే వారికి అందుబాటులో ఉన్న వాటితోనే ఇక అందాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మెడికల్ షాపుల్లో దొరికే ఎన్నో క్రీమ్లను వాడుతూ ఉండటం కూడా చూస్తూ ఉంటాం. అయితే ఇలా అందాన్ని పెంచుకోవడానికి కొంతమంది అమ్మాయిలు చేసే పని కాస్త చివరికి వారిని అంద విహీనంగా మార్చడం లాంటివి చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. చిత్రపుచిత్రమైన ఫేస్ ప్యాక్ లు వేసుకోవడం కారణంగా చివరికి ఉన్న అందం పోయి దారుణంగా తయారవుతూ ఉంటారు.  ఇప్పటికే ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయ్. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవులకు చెందినదే.


 తన అందాన్ని మరింత పెంచుకునేందుకు ఫేషియల్ చేసుకున్న ఒక మహిళకు చేదు అనుభవం ఎదురయింది. ఈ ఘటన ముంబైలో వెలుగులోకి వచ్చింది. ఫేషియల్ మసాజ్ ట్రీట్మెంట్ కోసం 17500 ఖర్చు చేశానని.. అయితే చికిత్స తర్వాత ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడ్డాయని సదరు మహిళ వాపోయింది. చర్మ వైద్యుడిని సంప్రదిస్తే మచ్చలు శాశ్వతంగా ఉంటాయని చెప్పడంతో షాక్ అయ్యాను అంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అదే సమయంలో సదురు బ్యూటీ సెలూన్ పై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: