
కేవలం ముసలి వాళ్లు.. మధ్య వయసు లో మాత్రమే కాదు అభం శుభం తెలియని చిన్నారులు సైతం సడన్ హార్ట్ ఎటాక్లతో కుప్ప కూలిపోయి చూస్తూ చూస్తుండ గానే కళ్ళ ముందు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ప్రతి ఒక్కరిలో ప్రాణ భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. అయితే ఎందుకు ఇలా హార్ట్ ఎటాకులు ఎక్కువగా వస్తున్నాయి అన్న విషయం అర్థం కాక ఎంతో మంది దినదిన గండం గానే భయంతో బ్రతుకును వెల్లదీస్తున్నారు.
అయితే ఇప్పటివరకు యువకుల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ హార్ట్ ఎటాక్ రావడం గురించి విన్నాము. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒక శిశువుకి 90 రోజుల్లోనే మూడుసార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది. నాగపూర్ లో నెలలు నిండకుండా పుట్టిన ఒక శిశువుకు మొదటి 90 రోజుల్లోనే మూడుసార్లు గుండెపోటు రాగా వైద్యులు కాపాడారు. ఈ శిశువుకు తల్లి గర్భంలోనే ఇన్ఫెక్షన్ సోకి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇలా నెలలు నిండని శిశువుకు సైతం హార్ట్ ఎటాక్ రావడం మాత్రం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.