
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. పెళ్లయి ఐదు నెలలు కూడా జరగలేదు. అప్పుడే దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ఇక భార్యను తుపాకీతో కాల్చిన భర్త తర్వాత తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోనే ముజుఫర్ నగర్ లో వెలుగులోకి వచ్చింది. మఖ్యాలి గ్రామంలో చోటుచేసుకుంది. నసీం మాలిక్ ఐదు నెలల నర్గీమ్ ను వివాహం చేసుకున్నాడు. పెళ్లికి సద్దాం వ్యక్తి మధ్యవర్తిగా ఉన్నాడు. అయితే నసీం నర్గీస్ మధ్య ఇటీవల గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవలే మధ్యవర్తి దగ్గరికి వెళ్లగా వీరిద్దరికి సర్థి చెప్పలేక సద్దాం కూడా అక్కడి నుంచి పారిపోయాడు.
అయితే వీరికి సర్ది చెప్పడానికి సాబీర్ అక్కడికి రాగా.. అతనిపై కూడా నసిమ్ కాల్పులు జరిపాడు. దీంతో గాయలతో అతను బయటపడగలిగాడు. ఆ తర్వాత నసీమ్ తన బైక్ పై భార్యను అక్కడి నుంచి ఎక్కించుకుని బయలుదేరి..కొంత దూరం వెళ్ళాక బండి ఆపేసి భార్యపై కాల్పులు జరిపాడు. తర్వాత నసీమ్ కూడా కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కాల్పుల్లో తీవ్ర గాయాల పాలైన మహిళ అక్కడే కొట్టుమిట్టాడుతూ మరణించింది. సమీపంలో ఉన్న ప్రజలు కళ్ళముందే ప్రాణాలు పోతుంటే ఫోన్లో రికార్డు చేశారే తప్ప ఆమెను కాపాడే ప్రయత్నం చేయలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు పిస్తోళ్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.