గుజరాత్ లోని రాజ్కోట్ లో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఏకంగా 13 ఏళ్ల మైనర్ బాలికపై 21 అత్యాచారానికి పాల్పడటమే కాదు ఆ తర్వాత దారుణంగా హత్య చేశాడు. జూన్ 27వ తేదీన బాలిక అదృశ్యంపై కేసు నమోదుకు నిందితుడిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఇందుకు సురేంద్రనగర్ జిల్లాకు చెందిన జయదీప్ అలియాస్ జయం పరివార్ గుర్తించారు. అయితే భిక్షాటన చేస్తూ జీవిస్తుంటాడని గతంలో అతను దొంగతనాలకు కూడా పాల్పడ్డాడని.. పోలీసులు గుర్తించారు. అయితే జయదీప్ మరణించిన బాలిక మేనమామతో పరిచయం పెంచుకున్నాడట.
ఆ పరిచయంతోనే తరచుగా బాలిక ఇంటికి వెళుతూ ఉండేవాడట జయదేవ్. అయితే బాలిక తన దినచర్యలో భాగంగా కట్టెలు తీసుకురావడానికి వెళ్తే ఇది గమనించిన నిందితుడు.. బాలికను అజీవ్ ఫ్యాక్టరీ కి లాక్కెళ్ళి అందులోనే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ప్రాణాలతో వదిలేస్తే కుటుంబ సభ్యులకు చెబుతుందని భయపడి చివరికి బరువైన వస్తువుతో బాలిక తలపై కొట్టి చంపేశాడు. కట్టెలకు వెళ్లిన కూతురు ఎంతకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలోనే నిందితుడు జయదీప్ వారి వెంటనే ఉండడం గమనార్హం. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో. చివరికి అతను చేసిన నేరం బయటపడింది.