
ఇక ఇటీవల ఒక ఆటో డ్రైవర్ కూడా విదేశీ పర్యాటకురాలి పట్ల ప్రవర్తించిన తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇక సదరు పర్యాటకురాలు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పినప్పటికీ ఆటోడ్రైవర్ మాత్రం తన తీరును మార్చుకోలేదు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. దీంతో సదరు ఆటో డ్రైవర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలు చూసుకుంటే.. అటు విదేశీ పర్యటకులను ఒక ఆటో డ్రైవర్ వెంబడిస్తూ వాళ్లతో పాటు నడుస్తూ కనిపించాడు.
అయితే ఇక ఆ విదేశీ పర్యటకురాలిపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ ఇక ఆమెను ఇబ్బందులకు గురి చేశాడు అని చెప్పాలి. అయితే ఆ క్షణం ఆమె ఇబ్బందిగా ఫీల్ అవుతున్న సరే పట్టించుకోకుండా ఆటో డ్రైవర్ దారుణంగా ప్రవర్తించాడు. దీంతో అతని వదిలించుకునేందుకు ఆ జంట ప్రయత్నించింది. అయితే రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది అన్నది తెలుస్తుంది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ ఈ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. అయితే ఇక సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి అంటూ సీఎం గెహ్లాట్ తో పాటు రాజస్థాన్ పోలీసులను కోరింది స్వాతి మలివాల్.