ఇక్కడ ఒక ఊరిలో కొంతమంది గ్రామస్తులు ఇద్దరు యువకులు విషయంలో తప్పుడు ఆలోచన చేసి చివరికి దారుణమైన శిక్ష వేశారు. సాదరణంగా యువకులు ఎవరైనా అమ్మాయిలపై వేధింపులకు పాల్పడ్డారు అంటే గ్రామస్తులు వారికి దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి విచారణ జరపడం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. గ్రామస్తులు కాస్త అతి చేశారు. అమ్మాయిలను వేధిస్తున్నారు అంటూ కొంతమంది యువకులపై ఆరోపణలు చేశారు.
ఆ ఆరోపణలు నిజమ కాదా అని తేల్చకుండా దారుణంగా యువకులను శిక్షించారు. ఏకంగా మెడలో చెప్పులు వేసి ఊరంతా తిప్పడమే కాదు ఇక మనుషుల మలాన్ని తినిపించారు. మధ్యప్రదేశ్లోని శివపురిలో అవమానకర ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటూ ఇద్దరు యువకులకు స్థానికులు చితక బాదారు. అంతే కాదు మలం తినిపించారు. మెడలో చెప్పులు వేసి ఊరంతా తిప్పారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తే ఆ ఇద్దరు యువకులు.. వేధింపులకు పాల్పడలేదు అన్న విషయం తేలింది. అదంతా అసత్య ఆరోపనలని భావించిన పోలీసులు.. ఇక వారిపై దాడి చేసిన ఏడుగురిని అరెస్టు చేశారు.