ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరులో కూడా ప్రాణభయం పెరిగిపోతుంది. దీనికి కారణం వెలుగులోకి వస్తున్న ఘటనలే. మొన్నటి వరకు కరోనా వైరస్ ఎక్కడ చంపేస్తుందో అని అందరు భయపడ్డారు. ఈ క్రమంలోనే సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి కాలు బయటపెట్టకుండా ఉండేందుకు ప్రయత్నించారు. అయితే ఇక కరోనా వైరస్ వ్యాక్సిన్లు వేసుకొని మాస్కులు పెట్టుకొని చివరికి ప్రాణాంతకమైన వైరస్ ను తరిమికొట్టారు. దీంతో వైరస్ ప్రభావం తగ్గడంతో ఇప్పుడిప్పుడే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సడెన్ హార్ట్ ఎటాక్ లు అందరి ప్రాణాలను తీసేస్తూ ఉన్నాయి.


 అభం శుభం తెలియని చిన్నారుల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరిని వదలడం లేదు. సడన్ హార్ట్ ఎటాక్లు ఎందుకు వస్తున్నాయ్.. ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదు. కానీ చూస్తూ చూస్తుండగానే మనుషుల ప్రాణాలను తీసేస్తూ ఉన్నాయి. అప్పటి వరకు సంతోషంగా సరదాగా గడిపిన వారు సైతం.. చూస్తుండగానే కుప్పకూలిపోయి సెకండ్లలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిలో ప్రాణ తీపిని పెంచేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలా సడన్ హార్ట్ ఎటాకులు ఏకంగా కరోనాను మించిన మహామ్మారీగా మారింది. ఎందుకంటే కరోనా ఎటాక్ చేసిన తర్వాత జాగ్రత్తలు పాటిస్తే తప్పించుకోవచ్చు అన్న విషయం అందరికీ తెలుసు.


 కానీ సడన్ హార్ట్ ఎటాక్ లు వచ్చిన తర్వాత ఎలా తప్పించుకోవాలో అని ఆలోచన చేసేలోపే ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఇటీవల ఖమ్మం జిల్లాలో కూడా ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగు చూసింది. ఏకంగా అన్నం తినడానికి గిన్నె ముందు కూర్చున్న వ్యక్తి ముద్ద కూడా నోట పెట్టకుండానే.. చివరికి కుప్పకూలిపోయాడు. అయితే కుటుంబ సభ్యులు వెంటనే అతని ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే అప్పటికే అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: