ప్రతిరోజు ఏదో ఒక వీడియో, లేదా ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఏ వస్తువు రేటు పెరిగినా కొన్ని రోజులు దానిమీదే చర్చ జరుగుతుంది. కొన్నిరోజుల క్రితం పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిన విషయం తెలిసిందే. అప్పుడు ఆ రేట్లే హాట్ టాపిక్. ఇలా ఇప్పుడు వైరల్ అవుతున్న విషయాల్లో టమాటా ఒకటి. టమాటా మీద వరుసగా మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. కొన్నిరోజులు క్రితం టమాటా అంటే మామూలు విషయమే. కానీ ఇప్పుడే టమాటా చాలా ఖరీదైంది. రోజురోజుకి టమాటా డిమాండ్ పెంచుకుంటూనే పోతుంది. ఏ వస్తువు కంటే టమాటా తక్కువ కాదని రోజురోజుకి ధర పెంచుకుంటూ పోతుంది. 20 రూపాయలకు కిలో ఉన్న టమాటా ఇప్పుడు 150 దాటేసింది. చాలా ప్రాంతాల్లో రికార్డు ధర పలుకుతుంది. ఇప్పటికే టమాటాలు దొంగతనాలు చేస్తున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అంతేకాదు ఏపీలో టమాటా కోసం ఒక హత్యే జరిగింది. రైతుని చంపడం కలకలం రేపుతోంది. దీంతో టమాటా దుకాణాల వద్ద సెక్యూరిటీ పెట్టేస్తున్నారు. అయితే తాజాగా టమాటాకి సెక్యూరిటీగా ఒక పాము ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

టమాటాలకు సెక్యూరిటీగా ఒక నాగుపాము కూర్చుని ఉంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హల్ చేస్తుంది. టమాటా ముట్టుకోవాలంటే పాము బుస్సు మంటుంది. పడగ విప్పిన నాగుపాము టమాటాకు సెక్యూరిటీగా ఉంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి టమాటా ముట్టుకోడానికి ప్రయత్నించాడు. అది చూసిన పాము పాము పడగవిప్పి కాటు వేయడానికి ప్రయత్నించింది. కొంత మంది ఈ వీడియో షేర్ చేస్తూ ఇప్పుడు టమాటా గొప్ప నిధి లాంటిదని చెబుతున్నారు. టమాటాకు మనుషులే కాదు పాము కూడా సెక్యూరిటీగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూసినవారందరు షాక్ అవుతున్నారు. టమాటాకి పాముని సెక్యూరిటీగా పెట్టడం ఏంటని ఫన్నీగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: