
ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతో వేగంగా గమ్యస్థానాలకు చేర్చే ఎక్స్ ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇక వినూత్నమైన రీతిలో మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకువచ్చింది భారత రైల్వే శాఖ. ఈ క్రమంలోనే వందే భారత్ రైళ్లు ప్రస్తుతం పట్టాలపై రయ్ రయ్ అంటూ బుల్లెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు అధునాతన టెక్నాలజీతో కూడిన ఈ వందే భారత రైళ్ల కారణంగా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది.
ఇటీవలే మధ్యప్రదేశ్ లోని భూపాల్ లో కూడా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. మూత్ర విసర్జన కోసం వందే భారత్ రైలు ఎక్కిన అబ్దుల్ అనే వ్యక్తికి ఊహించడం రీతిలో చేదు అనుభవం ఎదురైంది. అతడు టాయిలెట్ నుంచి బయటికి వచ్చేసరికి.. వందే భారత్ డోర్లు మూసుకుపోయాయి. రైలు కూడా ముందుకు కదిలింది. అయితే సాయం చేయాలంటూ అతడు టీసీని దీనంగా సంప్రదించాడు. అయితే టికెట్ లేకుండా రైలు ఎక్కినందుకు టీసీలు ఏకంగా ఒక వెయ్యి 20 రూపాయలు అతనికి ఫైన్ వేశారు. తర్వాత స్టేషన్లో దిగి మరో 750 రూపాయలు వెచ్చించి.. బస్సులో భూపాల్ చేరుకున్నాడు సదరు వ్యక్తి. అదే సమయంలో అతను బుక్ చేసిన 4000 రూపాయల విలువైన రైలు టికెట్లు కూడా వృధా అయిపోయాయి అని చెప్పాలి. ఇలా అతను మూత్రం పోసినందుకు 6000 పోగొట్టుకున్నాడు అని చెప్పాలి.