భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు చిరునామాగా ఉండాలి. కానీ ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు  చూసిన తర్వాత అలాంటి అన్యోన్యత మాత్రం ఎక్కడా ఎవరిలో కనిపించడం లేదు అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడగా నిలవాల్సిన భార్యాభర్తలు చివరికి ఏకంగా బద్ధ శత్రువులుగా మారిపోతున్నారు అని చెప్పాలి. ఒకరిపై ఒకరు పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్.


 అయితే భాగస్వామితో దాంపత్య జీవితం బాగాలేదు అనిపించినప్పుడు.. చట్ట ప్రకారం విడాకులు తీసుకుని విడిపోయి.. ఎవరి దారి వారు చూసుకోవడం చాలా మంచిది. కానీ ఇటీవల కాలంలో ఎవరు కూడా ఇలాంటి పనిచేయడం లేదు. ఎందుకంటే ఏకంగా విడాకులు తీసుకోవడం కాదు.. కట్టుకున్న వారిపై పగ తీర్చుకోవడానికి రగిలిపోతున్నారు అని చెప్పాలి. వెరసి కొంతమంది ప్రాణాలు తీస్తుంటే.. ఇంకొంతమంది దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది.



 ఏకంగా భార్య చేసిన పనికి భర్తకు చుక్కలు కనిపించాయి. భార్యా భర్తల మధ్య ముద్దు ముచ్చట అనేది కామన్. అయితే ఇటీవల భర్త భార్యకు లిప్ కిస్ ఇచ్చాడు. ఇదే అదే అదనుగా  భావించిన భార్య.. అతని నాలుకను కోరికేసింది. కర్నూలు జిల్లా లో వెలుగు  లోకి ఈ ఘటన వచ్చింది. తారాచంద్ నాయక్, పుష్పవతి 2015లో లవ్ మ్యారేజ్ చేసుకోగా.. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవల  భార్యా భర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇదే మనసులో పెట్టుకున్న భార్య చివరికి భర్త నాలుక కోరికేసింది. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే తనపై దాడి చేసి బలవంతంగా ముద్దు పెట్టాలని ప్రయత్నించినందుకే.. తాను నాలుక కొరికేశాను అంటూ పుష్పవతి చెబుతుంది  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: