మొన్నటి వరకు ప్రేమలో పడి ఎన్నో మధురానుభూతులను ఆస్వాదించాలని ప్రతి ఒక్కరు కూడా భావించే వారు. కానీ ఇప్పుడు ప్రేమలో పడిన తర్వాత కలలో కూడా ఊహించని ఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది వెలుగులోకి వచ్చే ఘటనలు ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే స్వీట్ మెమోరీస్ ఉంటాయి కదా అని ప్రేమలో పడితే చివరికి స్వీట్ మెమరీస్ గురించి దేవుడెరుగు ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ప్రేమించిన వారు మోసం చేశారని కొంతమంది.. ఇక పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇక ఏకంగా కనిపించిన తల్లిదండ్రుల చేతిలోనే దారుణ హత్యలకు గురవుతున్న వారు మరి కొంతమంది.. ఏకంగా కుటుంబ సభ్యులు దారుణంగా దాడి చేయడంతో గాయపడుతున్న వారు ఇంకొంతమంది. ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి.


 దీంతో ప్రేమ అనే పేరు ఎత్తాలంటేనే యువతి యువకులు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ధైర్యం చేసి ప్రేమ అనే మాయలో పడిపోతున్న తర్వాత మాత్రం అనూహ్యమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అని చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఐదేళ్లుగా ఆ ఇద్దరు  యువతీ యువకులు ప్రేమించుకుంటున్నారు. కానీ ఏమైందో ఈ మధ్యకాలంలో వారి ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యయ్. దీంతో సరిగ్గా మాట్లాడుకోవడం లేదు. అయితే ఈ విషయం పెద్దల వరకు వెళ్ళింది. అయితే ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు యువతి కుటుంబ సభ్యులు యువకుడిని ఇంటికి పిలిపించారు.



 అయితే వారి మాటలు గుడ్డిగా నమ్మిన యువకుడు ఇంటికి వెళ్ళగా చివరికి దారుణంగా దాడి చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని కాశీపూర్ లో వెలుగులోకి వచ్చింది. బోజో ఖాన్ అనే యువతి, మోమినల్ ఇస్లాం అనే యువకుడు 5 ఏళ్ళుగా ప్రేమించుకుంటూ ఉండగా.. ఇటీవల వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ప్రియురాలి బంధువులు సయోధ్య కుదుర్చేందుకు  మోమీనల్ ను ఇంటికి పిలిపించారు. అయితే అక్కడ పెద్ద గొడవ జరగా యువతి కుటుంబ సభ్యులు మోమినల్ పై దాడి చేశారు. అంతేకాదు పెదవులను కోసేశారు. రక్తం కారుతుండగా అతను అతి కష్టం మీద ఇంటికి చేరుకోగా గమనించిన కుటుంబ సభ్యులు అతని ఆస్పత్రిలో చేర్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: