సాధారణంగా ఉపాధ్యాయులు ప్రతి విషయంలో కాస్త హుందాగానే  ప్రవర్తిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఏదైనా గొడవ జరిగినప్పుడు కూడా ఆ గొడవ సద్దుమణిగేలా కాస్త హుందాగానే సమాధానం చెబుతూ ఉంటారు. అలాంటి ఉపాధ్యాయులు గొడవపడ్డారు అంటే దానికి ఒక పెద్ద కారణమే ఉండి ఉంటుంది అని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే ఏకంగా ఒక మహిళ టీచర్ స్కూల్లో వంటమనిషితో గొడవ పడింది అంటే.. ఇక ఆహారం విషయంలో ఏదో తప్పు చేసి ఉంటేనే విద్యార్థుల కోసం టీచర్ గొడవపడి ఉంటుందని భావిస్తూ ఉంటారు.


 ఇక్కడ టీచర్ ఏకంగా స్కూల్లో వంట చేసే వంట మనిషితో గొడవ పడింది. ఎంతలా అంటే ఇద్దరు కూడా సిగపట్లు పట్టుకునేంతగా గొడవపడ్డారు. ఇంత గొడవ పడిందంటే పాపం విద్యార్థుల కోసం టీచర్ బాగానే పోరాడుతుంది అనుకుంటారు. ఎవరైనా నిజమే  ఇక్కడ జరిగింది కూడా ఇదే. ఏకంగా కిచిడి కోసం వంట మనిషికి టీచర్ కి మధ్య తలెత్తిన వివాదం సిగబట్లు పట్టుకునేంతవరకు వెళ్ళింది. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్ మండలం తరువు తాలూకాలో వెలుగులోకి వచ్చింది.  జిల్లా పరిషత్ పాఠశాలలో ఘటన జరిగింది. కిచిడి నాణ్యంగా లేదని ఆరోపిస్తూ వంటమనిషితో టీచర్ వాదించింది.


 అదే సమయంలో స్కూల్ ఆవరణలో వంట మనిషి భర్త షాప్ పెట్టడాన్ని టీచర్ నిలదీసింది. దీంతో వంట మనిషి కూడా రెచ్చిపోయింది. నువ్వు ఎవరు నన్ను అడగడానికి అంటూ టీచర్తో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. దీంతో ఇద్దరు ఒకరి జుట్టూ ఒకరు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఆ పాఠశాలలో ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు 60 మంది విద్యార్థులు చదువుతుండగా.. పిల్లలకు పెట్టే కిచిడి విషయంలో నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయి. కిచిడి నాణ్యతలేగా లేదని పిల్లల టీచర్ దృష్టికి తీసుకెళ్లగా ఇదే విషయంపై వంట మనిషిని ప్రశ్నిస్తే ఇక చివరికి వీరిద్దరి మధ్య వాగ్వాదం కొట్టుకునేంతవరకు వెళ్ళింది అని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: