ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కానీ ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు  కానీ వాహనదారుల  తీరులో మాత్రం అస్సలు మార్పు రావడం లేదు. ఇలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి నిర్లక్ష్య ధోరణి కొన్ని సార్లు ఏకంగాఎదుటి వాళ్లకు శాపంగా మారిపోతున్నాయి అని చెప్పాలి.


 ఎందుకంటే అతివేగంగా వెళ్లడం కారణంగా కొంతమంది వాహనదారులు తమ ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకుంటుంటే.. ఇంకొన్నిసార్లు అభం శుభం తెలియని అమాయకులు చివరికి రోడ్డు ప్రమాదాల కారణంగా బలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఇలా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కొన్ని ఘటనల్లో ఏకంగా యాక్సిడెంట్ చేసి మళ్లీ ఎవరికీ దొరక్కుండా పారిపోతున్న వాహనదారులు కూడా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఘటనల విషయంలో కేంద్రం కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతుంది.


 ఈ క్రమంలోనే రహదారులపై ర్యాష్ డ్రైవింగ్ కట్టడం చేసేందుకు కీలక చర్యలు చేపట్టేందుకు రెడీ అయింది. యాక్సిడెంట్ చేసి పారిపోతే పదేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు కొత్త చట్టం తీసుకురానుంది. కేంద్రం క్రిమినల్ చట్టాలను సమూలంగా మార్చే క్రమంలో భాగంగా భారతీయ న్యాయ సంహిత బిల్లులో ఇక ఈ శిక్షలను పొందుపరచబోతుంది. అయితే రాస్ డ్రైవింగ్ వల్ల ప్రమాదం జరిగినప్పుడు పోలీసులకు చెబితే ఏడేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించనున్నారు. ఇలా చేయడం ద్వారా ఆయన రోడ్డు ప్రమాదాల సంఖ్యతగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం.మరికొన్ని రోజుల్లో ఈ నిబంధనలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అయితే రోడ్డు నిబంధనల విషయంలోనే కాదు మరికొన్ని చట్టాల విషయంలో కూడా మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమైంది కేంద్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: