పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం. ఈ క్రమంలోనే ఇష్టమైన భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించి వందేళ్ల పాటు ఎంతో సంతోషంగా గడపాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటే. మరి కొంతమంది పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని వారితోనే హ్యాపీగా వైవాహిక జీవితాన్ని గడుపుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో పెళ్లి విషయంలో కొంతమంది అటు వయస్సు భేదాన్ని కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు పెళ్లి కొడుకు కంటే పెళ్లికూతురు కాస్త వయస్సు తక్కువగా ఉండాలని పెద్దలు చెప్పేవారు. కానీ ఇటీవల కాలంలో తమకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలను కూడా కొంతమంది అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.


 ఇలా వయసు భేదం అనేది పెద్ద నేరం ఏమీ కాదు అన్నట్లుగానే అందరి ఆలోచన తీరు మారిపోయింది అని చెప్పాలి  కానీ ఇక్కడ ఒక యువకుడు ఇలాంటి వయస్సు బేధం కారణంగా మనస్థాపం చెంది చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు  అందరి యువకుల్లాగానే అతని కూడా ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకొని వైవాహిక బంధం లోకి అడుగు పెట్టాలని ఆశపడ్డాడు. కానీ పెళ్లికి ముందే   అతనికి ఒక షాకింగ్ నిజం తెలిసింది  తాను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి తనకంటే వయసులో పెద్దది అని తెలుసుకుని షాక్ అయ్యాడు. దీంతో మనస్థాపంతో చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది.


 శివమొగ్గ తాలూకాకు చెందిన స్వామినాథ అనే 32 ఏళ్ల వ్యక్తికి రెండు నెలల క్రితమే వివాహం నిశ్చయం అయింది. అయితే ఇటీవల అతను పెళ్లి చేసుకోబోతున్న యువతి  గురించి షాకింగ్ విషయం తెలిసింది. అతను పెళ్లి చేసుకోబోయే యువతి తన కంటే మూడేళ్లు పెద్దది అని తెలియడంతో స్వామినాథ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.  పెళ్లికి నిరాకరించాడు. కానీ యువతి కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు రావడంతో మనస్తాపం చెంది చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: