ఇక ఆ తర్వాత ఆ భార్యాభర్తలిద్దరూ కూడా యువతిని వెట్టి చాకిరి చేయించడం మొదలుపెట్టారు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. సింగాడి కుంటకు చెందిన దీప్తి అనే విద్యార్థిని యూసుఫ్గూడా లో డాన్స్ స్కూలుకు వస్తూ ఉండేది. అయితే అక్కడ హోమ్ ట్యూషన్ లు చెప్పే కరజాడ గాంధీ అనే వ్యక్తితో పరిచయ ఏర్పడింది. అయితే దీప్తిని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని సదరు యువకుడు నమ్మ పలికాడు. అయితే అతనికి అప్పటికే రోజ అనే యువతి తో పెళ్లయింది. కానీ ఈ విషయం దీప్తికి తెలియకపోవడంతో అతని ప్రేమను అంగీకరించింది.
ఇక పెళ్లికి కూడా ఇద్దరూ వీరు కుటుంబీకులను ఒప్పించారు. కానీ పెళ్లయ్యాక గాంధీ వ్యవహార శైలపై దీప్తి కుటుంబానికి అనుమానం వచ్చింది. ఆరా తీస్తే అతడికి రోజాతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. గాంధీని నిలదీస్తే అతను బుకాయించాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య చివరికి గొడవ జరిగింది. చివరికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లగా.. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ కు రోజా కూడా వచ్చింది. గాంధీకి తాను కేవలం ఫ్రెండ్ మాత్రమేనని వేరే సంబంధం లేదు అంటూ నమ్మబలికింది. తానే దగ్గరుండి దీప్తి గాంధీ లకు పెళ్లి చేస్తానంటూ చెప్పింది. అయితే దీప్తి కుటుంబ సభ్యులు ఆమె మాటలు నమ్మి ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు. అయితే పెళ్లయ్యాక గాంధీ రోజు రాత్రి ఆలస్యంగా రావడంతో దీప్తి నిలదీసింది. మర్నాడు రోజ వారి వద్దకు వచ్చి చేరింది. రోజా గాంధీ ఇద్దరు కలిసి దీప్తిని వేధించడం మొదలుపెట్టారు. దీంతో బేధింపులు తట్టుకోలేక చివరికి పోలీసులను ఆశ్రయించింది. ఇక ఆ తర్వాత ఆరా తీస్తే రోజా గాంధీకి ముందే పెళ్లయిన విషయం బయటపడింది.