ఈ క్రమంలోనే వర్షాకాలంలో దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు ఇక మస్కిటో రిలేటెడ్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. మార్కెట్లో ఇలా దోమలను నివారణకు ఎన్నో ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటివాటిలో మస్కిటో కిల్లర్ లిక్విడ్స్ మస్కిటో కాయిల్స్ కూడా ఉంటాయ్. ఇలా మస్కిటో కిల్లర్ లిక్విడ్స్ వాడటం ద్వారా దోమలను చంపాలని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇలా దోమల బెడద నుంచి తప్పించుకోవడానికి పెట్టిన మస్కిటో కిల్లర్ లిక్విడ్ చివరికి నలుగురు ప్రాణం పోవడానికి కారణమైంది. ఈ నమ్మశక్యం కానీ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది.
మనాలిలో జరిగిన ఈ విషాదకర ఘటనతో ఇక స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ప్లగ్లో పెట్టిన మస్కిటో కిల్లర్ లిక్విడ్ బాటిల్ సడన్గా పేలిపోయింది. దాంతో ఒకే కుటుంబానికి నలుగురు మృతి చెందారు. దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండడం గమనార్హం. ఇక పవర్ ప్లగ్ లో లిక్విడ్ బాటిల్ పెట్టిన నిద్రపోయారట. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా బాటిల్ పేలింది. దాంతో స్విచ్ బోర్డు దగ్గర ఉన్న గుడ్డలకు మంటలు అంటుకున్నాయని.. స్థానికులు చెబుతున్నారు. అయితే ఇక దట్టమైన వాసన రావడంతో ఊపిరి పీల్చుకోలేక నలుగురి ప్రాణం పోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.