ప్రస్తుతం దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది. ఈ క్రమంలోనే మనిషి జీవనశైలిలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే  భారత శాస్త్రవేత్తలు సైతం అటు చంద్రుడిపై అడుగు పెట్టడంలో.. విజయం సాధిస్తే అటు ఇండియాలో ఉన్న కొంతమంది జనాలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలను పట్టుకొని వేలాడుతూ ఉన్నారు అని చెప్పాలి. మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని ఇంకా గుడ్డిగా నమ్ముతూ ఉన్నారు. ఈ క్రమంలోనే చిత్ర విచిత్రమైన  ప్రవర్తనతో వార్తల్లో హాట్ టాపిక్ గా  మారిపోతున్నారు.


 ముఖ్యంగా బురిడీ బాబాలు చెప్పింది నిజమే అనుకుని గుడ్డిగా నమ్ముతున్న జనాలు.. చివరికి మోసపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా కఠిన జరిగింది. ఏకంగా జ్యోతిష్యుడు చెప్పాడని ఉంటున్న ఇంట్లోనే ఏకంగా 2 అడుగుల గోతి తవ్వారు  దంపతులు. కానీ ఆ తర్వాత వాళ్ళకి ఊహించని రీతిలో చేదు అనుభవం ఎదురయింది. ఈ ఘటన కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో వెలుగు చూసింది. బెంగళూరుకు చెందిన ఒక జ్యోతిష్యుడు అణుర్ తాలూకాలో బిఎస్ దొడ్డి గ్రామానికి చెందిన భాగ్య ఇంట్లో నిధి ఉందని నమ్మించాడు.



 అయితే అతని మాటలు విన్న జమీందారు ఒక జ్యోతిష్యుడిని  ఇంటికి పిలిపించి ప్రత్యేక పూజలు చేయించారు. ఇంట్లో మూడు అడుగుల వెడల్పు 20 అడుగుల లోతైన గొయ్యిని తవ్వాలని ఆదేశించాడు. నిధి కోసం ఇక ఆ ఇంటి యజమానులు ఆ పని చేశారు. ఇలా చేస్తే నిధికి కాపలాగా ఉన్న పాములు పారిపోయి నిధి మీ సొంతం అవుతుందని చెప్పాడు. ఇక దీనికోసం ప్రత్యేక పూజ చేసినందుకు అతను కూడా భారీగానే డబ్బులు వసూలు చేశాడు. అయితే పూజారి చెప్పినట్లుగానే మూడు అడుగులు మెడల్పు 20అడుగుల లోతులో పెద్ద గుంత తవ్వారు. అయితే ఇరుగుపొరుగు  వారు చెప్పడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికి జ్యోతిష్యుడు అతని స్నేహితుడు కూడా అక్కడి నుంచి పారిపోయారు. యజమానిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: