నేటి సభ్య సమాజంలో మంత్ర తంత్రాలు ఉన్నాయో లేదో తెలియదు. కానీ అవి ఉన్నాయి అని నమ్మే జనాలు మాత్రం కాస్త ఎక్కువగానే ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే పెద్దలు చెప్పిన కొన్ని విషయాలను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారూ జనాలు. ముఖ్యంగా ఎవరికన్ను పడిన తప్పించుకోవచ్చు కానీ నరుడు కన్ను పడింది అంటే తప్పించుకోవడం చాలా కష్టం అని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. అదేనండి నరదిష్టి ఉంది అంటే ఎంతటి వాడైనా సరే పాతాళానికి కూరుకు పోతాడు అని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే నర దిష్టికి భయపడి ఎంతోమంది చిత్ర విచిత్రమైన రీతిలో పరిహారం చూసుకోవడం చేస్తూ ఉంటారు.

 ఏదైనా కొత్తగా ఇల్లు కట్టుకున్నారు అంటే చాలు ఇక దానికి నరదిష్టి యంత్రం ఏర్పాటు చేయడం  చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ఎంతోమంది ఇలాంటివి చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు బీర పంటను వేసిన రైతు కూడా ఇలాగే వినూత్నంగా ఆలోచించారూ.  తారు రోడ్డు పక్కనే ఆమెకు వ్యవసాయ పొలం ఉంది. అందులో నెలరోజుల పండే బీర పంట సాగు చేశాడు. అది ఏపుగా పెరిగి కాయలు కూడా కాసాయి. ఈ క్రమంలోనే ఆ రోడ్డు నుండి వెళ్తున్న ఎంతమంది వాహనదారులు ఆ బీరపండును చూస్తూ వెళ్లేవారు.


 ఈ క్రమంలోనే నరదిష్టి కారణంగా తన పంట దెబ్బతింటుంది అన్న నిబంధనతో రైతు వినూతమైన ఆలోచన చేసింది మహిళ రైతు. ఏకంగా బీర పంట వేసిన చేనులో ఒక కోతి ఫ్లెక్సీలు తయారు చేసించి పాతించాడు. పెద్దపెద్ద అక్షరాలతో కొటేషన్ కూడా రాసి ఇక ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. అయితే అటువైపుగా వెళ్లే ప్రయాణికుల కళ్ళు ఆ పంటపై కాకుండా మధ్యలో ఉన్న ఫ్లెక్సీ పై పడి పంటకు ఎలాంటి హాని కలగదు అని రైతు ఇలా చేసింది అన్నది తెలుస్తుంది. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోచమ్మ అనే రైతుకు తారు రోడ్డు పక్కన ఎకరం భూమి ఉంది. అందులో పంట సాగు చేస్తుంది. వర్షాలు సమృద్ధిగా పోవడంతో పంట ఏపుగా పెరిగింది. అయితే చుట్టుపక్కల జనాలు కళ్ళు తన పంటపై పడకూడదని ఆ రైతు ఇలా కోతి ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: