వెయ్యి అబద్ధాలు ఆడి అయినా సరే ఒక పెళ్లి చేయాలి అని చెబుతూ ఉంటారు పెద్దలు. అందుకే కొంతమంది ఏకంగా పెళ్లి విషయంలో నిజంగానే కొన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక ప్రేమ జంట తమ పెళ్లి చేసుకునేందుకు పోలీసులతో అబద్ధం చెప్పింది. కానీ చివరికి పోలీసులనే బురిడీ కొట్టించింది ఆ ప్రేమ జంట.  సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అబ్బాయిది మేళ్లచెరువు అయితే అమ్మాయిది మునగాల పోలీస్ స్టేషన్ పరిధి. వీరిద్దరూ కలిసి చదువుకున్న సమయంలో వీరి మధ్య ప్రేమ పుట్టింది. ఇక పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.


 అయితే వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించరు అనే భయంతో ఈ నెల ఒకటవ తేదీన ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది ఈ జంట. ఈ క్రమంలోనే రక్షణ కోసం మేళ్లచెరువు పోలీసులను ఆశ్రయించారు. తాము మేజర్లమని ధ్రువీకరణ పత్రాలు ఆధార కార్డులను కూడా చూపించారు. దీంతో గుడ్డిగా నమ్మిన పోలీసులు ప్రేమ జంటకు రక్షణ కల్పించారూ. అంతేకాదు ఇద్దరి కుటుంబ సభ్యులను పిలిపించి ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను ఇబ్బందులు పెట్టొద్దు అంటూ మందలించి లేఖ కూడా రాయించుకున్నారు.


 20 రోజులు పాటు ప్రేమ జంట కాపురం సజావుగానే సాగింది. 3 రోజుల క్రితం అమ్మాయి మైనర్ అంటూ మేళ్లచెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ జంట వయస్సు మార్చి ఫోర్జరీ ఆధార్ కార్డు పత్రాలను చూయించి వివాహం చేసుకున్నారని.. తల్లిదండ్రులు పోలీసులకు ఒరిజినల్ దృవీకరణ పత్రాలు చూపించారు. దీంతో  పోలీసు యువకుడిపై కేసు నమోదు చేశారు.. కులాంతర వివాహం చేసుకొని రక్షణ కోసం  తప్పుడు దృవీకరణ పత్రాలను చూపించి పోలీసులను కొట్టించడంతో ఖాఖీలు షాక్ అయ్యారు. అయితే కనీస వయస్సు నిర్ధారించుకోకుండానే పోలీసులు మైనర్లు మేజర్లు అని చెప్పగానే నమ్మి వారికి రక్షణ కల్పించడం విడ్డూరంగా ఉందని పోలీసుల తీరుపై స్థానికులు తప్పడుతూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: