పెళ్లంటే నూరేళ్లపంట అని అంటూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం పెళ్లి అంటే ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎంతోమంది అమ్మాయిలు మంచి ఉద్యోగం ఉండి.. బ్యాంకు బ్యాలెన్స్ ఎక్కువగా ఉన్న అబ్బాయి భర్తగా రావాలని కోరుకుంటూ ఉన్నారు. మంచి మనసున్న వాడు బాగా చూసుకునేవాడు కావాలి అని ఆలోచన చేయట్లేదు. అదే సమయంలో అబ్బాయిలు భారీగా కట్నం ఇచ్చే అమ్మాయి వస్తే ఎంత బాగుందో అనే కమర్షియల్ గానే ఆలోచిస్తూ ఉన్నారు.


 అర్థం చేసుకునే అమ్మాయి వస్తే జీవితాంతం ఏం లేకపోయినా సంతోషంగా ఉండవచ్చు అని ఆలోచించేవారు తక్కువైపోయారు. ఇంకొంతమంది అయితే ఏకంగా పెళ్లిని బిజినెస్ గా మార్చుకుంటున్నారు. పెళ్లి పేరుతో మోసం చేసి అందిన కాడికి దోచుకోవడానికి సిద్ధమైపోతున్నారూ అని చెప్పాలి. ఇటీవల  ఉత్తరప్రదేశ్ లోని మోరాదాబాద్ లో ఓ వింత ఘటన వెలుగు చూసింది. పెళ్లి ఎంతో గ్రాండ్గా జరిగింది  కానీ ఆ తర్వాత మొదటి రాత్రి వరుడికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఠాకూర్ అనే యువతి 2019లో మూరాదాబాద్ లోని ఒక గ్రామానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది.


 యువకుడు ఎంతో ఆర్భాటంగా వివాహ వేడుకను చేసుకున్నాడు. తర్వాత భార్యతో కలిసి ఇంటికి వచ్చాడు. సుహాగ్రత్ సమయంలో భార్య తలపై ఉన్న కొంగును తొలగించిన వెంటనే ఆమె ఒరిజినాలిటీ బయటపడింది. ఆమెను చూసి నవ వరుడు షాక్ అయ్యాడు. ఈ విషయంపై మాట్లాడిన ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతున్నానని.. త్వరలోనే స్త్రీ జగనేంద్రియాలు అభివృద్ధి చెందుతాయని చెప్పింది.  ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడింది. దీంతో భర్త ఎవరికీ చెప్పకుండా ఇక భార్య జననేంద్రియాల ఫలితం కోసం ఎదురు చూస్తుండగా.. ఇక అతని భార్య అత్త మామలు అతని నుంచి 20 లక్షలు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశారు. ఈ క్రమంలోనే భర్త పోలీసులను ఆశ్రయించిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: