ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే జరిగింది అని చెప్పాలి. ఇక్కడ ఒక ఐదు నెలల బాబు తన తోబుట్టులతో ఆడుకుంటున్నాడు. అతను చేసిన పని చివరికి అతను ఆస్పత్రి పాలు చేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో వెలుగు చూసింది. జంగిల్ పారాకు చెందిన ఒక మహిళ తన కుమారుడిని తోబుట్టువుల వద్ద ఉంచి తన పనిలో నిమగ్నమైంది. అయితే ఐదు నెలల బాలుడు ఆడుకుంటూ ఒక పిన్నిస్ మింగేసాడు.ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లగా శ్వాస తీసుకునేందుకు కావలసిన చికిత్స అందించారు.
అయితే అటు బాలుడు మాత్రం ఎంతకీ ఏడుపు ఆపలేదు. కలకత్తా మెడికల్ కాలేజీకి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే అక్కడ వైద్యులు ఆ బాలుడిని పరీక్షించారు అయితే ఎక్స్రే తీయగా శ్వాసనాలంపై పిన్నీసు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. ఈ క్రమంలోనే బాలుడికి 45 నిమిషాల పాటు సర్జరీ చేసి ఆ పిన్నిసును విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం ఊపిరి తీసుకోవడంలో బాలుడు ఎక్కడ ఇబ్బంది పడటం లేదని వైద్యులు స్పష్టం చేశారు.