ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోయిన మనిషి ప్రతి విషయాన్ని సులభతరం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టెక్నాలజీకి అనుగుణంగానే ప్రతి ఒక్కరు ఉద్యోగం చేసే విధానం కూడా మారిపోయింది. అయితే ఈ టెక్నాలజీ పెరిగిపోవడం మంచి పనులకే కాదు.. చెడు పనులకు ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏకంగా ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని ఎంతోమంది సైబర్ నేరగాళ్లు జనాలను బురిడీ కొట్టిస్తున్నారు.


 మాయమాటలతో నమ్మించి ఎంతోమంది ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అయితే ఇలా సైబర్ నేరాల విషయంలో ఎప్పటికప్పుడు వినూత్నమైన దారులను వెతుకుతూ జనాలను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు అని చెప్పాలి. దీంతో ఇలాంటి తరహా కేసులు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇలాంటి ఘటన వెలుగు చూసింది. ఇటీవల కాలంలో ఎంతోమంది ఒక ఉద్యోగం చేస్తున్న పార్ట్ టైం గా మరో ఉద్యోగం చేయాలని భావిస్తున్నారు. ఇక చదువుకునే విద్యార్థులు కూడా పార్ట్ ఉద్యోగం దొరికితే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి కూడా ఇలాగే పార్ట్ టైం జాబ్ చేయాలి అని అనుకున్నాడు.


 అయితే పార్ట్ టైం జాబ్ చేయాలి అనే ఆలోచన చివరికి 28 లక్షలు పోగొట్టుకోవడానికి కారణమైంది. పార్ట్ టైం ఉద్యోగం అని నమ్మించి సైబర్ కేటుగాళ్లు  28 లక్షల రూపాయలు దోచేసారు. సికింద్రాబాద్ కు చెందిన ఒకరికి గుర్తుతెలియని వ్యక్తి వాట్సప్ కాల్ చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించాడు. బాధితుడు 2000 పెడితే 4000 ఇచ్చారు. దీంతో విడుదలవారీగా 28 లక్షల పెట్టుబడి పెట్టగా.. ఆ తర్వాత అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన అతను వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఇలాంటి విషయాలలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎంతల అవగాహన కల్పిస్తున్న.. అటు జనాల తీరులో మాత్రం మార్పు రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: