ఇప్పటికీ ఏదైనా అనారోగ్య సమస్య వచ్చింది అంటే నేరుగా వైద్యుడి దగ్గరికి చికిత్స చేయించుకోకుండా.. ఏకంగా భూత వైద్యుడు దగ్గరికి లేదా నాటు వైద్యుడు దగ్గరికి వెళ్లి తాయత్తులు కట్టించుకోవడం లేదా నాటువైద్యం చేయించుకోవడం లాంటివీ చేస్తున్న జనాలు కూడా కనిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చి అందరిని అవకాకయ్యేలా చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవల్లోకి చెందినదే. నెలన్నర వయస్సు ఉన్న శిశువుకి అనారోగ్యం రావడంతో.. ఇక నాటు వైద్యుడు దగ్గరికి వెళ్లారు. దీంతో ముక్కుపచ్చలారని ఆ చిన్నారికి ఏకంగా 40 వాతలు పెట్టాడు అని నాటు వైద్యుడు.
మధ్యప్రదేశ్లోని షహదోల్ జిల్లాలో ఉన్న హారదోల్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిమోనియాతో బాధపడుతున్న నెల శిశువుని ఆసుపత్రిలో చేర్పించగా.. శిశువు పొట్ట మెడ ఇతర భాగాలపై 40 వాతలు చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. నాటువైద్యం పేరుతో వాతలు పెట్టిన గ్రామ నర్సు భూటి బాయితో పాటు చిన్నారి తల్లి, తాతలపై కూడా కేసు నమోదు అయింది. ప్రస్తుతం సహడోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో సదరు చిన్నారి చికిత్స పొందుతూ ఉన్నాడు అని చెప్పాలి. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.