
ఏకంగా చిన్నచిన్న కారణాలకే ఎదుటివారి ప్రాణాలు తీయడానికి మనుషులు ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. చాక్లెట్ తిన్నంత ఈజీగా మనిషి ప్రాణాలను గాలిలో కలిపేస్తున్న ఉన్మాదులే నేటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత మనుషుల్లో ఉండే జాలి దయ అనే గుణం పూర్తిగా కనుమరుగూ అయిందేమో అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. అయితే పరాయి వాళ్ళ విషయంలోనే కాదు సొంత వారి విషయంలోనూ ఇలా ప్రవర్తిస్తున్న మనుషులు.. నేటి రోజుల్లో చాలామంది కనిపిస్తున్నారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవులకు చెందినదే.
సాధారణంగా మహిళలు ఇంట్లో చాలా పనులు చేస్తూ ఉంటారు. ఇక భర్త కాఫీ ఇవ్వమని అడిగాడు అంటే కొన్ని కొన్ని సార్లు కాస్త లేట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఇలా లేట్ అవ్వడమే ఇక్కడ ఒక మహిళ ప్రాణం పోవడానికి కారణమైంది. టీ తేవడం ఆలస్యం కావడంతో భార్యను దారుణంగా చంపేశాడు భర్త. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో భోజపుర్ గ్రామంలో.. ఈ ఘటన వెలుగు చూసింది. నిందితుడు ధరం వీర్ ఇటీవల ఉదయం భార్య సుందరిని టీ పెట్టమని అడిగాడు. ప్రస్తుతం వేరే పని చేస్తున్నానని.. కాస్త టైం పడుతుందని భార్య బదులు ఇవ్వగా.. ఇదే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో భార్య గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అరెస్టు చేశారు.