ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణభయాన్ని కలిగిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఏకంగా సౌకర్యం కోసం తెచ్చుకునీ రోజు వాడే వస్తువులు కూడా కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు పోవడానికి కారణం అవుతూ ఉంటాయి. ఆయా వస్తువుల వాడకంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు కారణంగా చివరికి మృతి ఒడిలోకి చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా అనూహ్యమైన రీతిలో తండ్రి కూతుర్లు ప్రాణాలు కోల్పోయారు. చలికాలం రావడంతో రూమ్ మొత్తం కాస్త వెచ్చగా ఉంచుకోవడానికి.. ఎంతో మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.
కొంతమంది రూమ్ హీటర్ తెచ్చుకుంటూ ఉంటారు ఇక్కడ ఓ కుటుంబం ఇలాగే రూమ్ హీటర్ తెచ్చుకుంది. కానీ అదే వారి ప్రాణం తీస్తుంది అని మాత్రం ఊహించలేకపోయారు కుటుంబ సభ్యులు. రాజస్థాన్లోని ఖైరతాల్ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. రూమ్ హీటర్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగడంతో.. తండ్రి దీపక్ యాదవ్ మూడు నెలల కూతురు నిషిక సజీవ దహనమయ్యారు. దీపక్ భారీ సంజు తీవ్ర గాయాలతో చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుత ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే చలికాలంలో రూమ్ హీటర్లను వాడటానికి ముందు ఇక దానిని టెక్నీషియన్ లతో ముందు జాగ్రత్తలో భాగంగా చెక్ చేయించుకుంటే బాగుంటుంది అంటూ పోలీసులు సూచిస్తున్నారు.