ఇటీవల కాలంలో ఆడపిల్లల జీవితం రోజురోజుకు దుర్భరంగా మారిపోతుంది తప్ప ఎక్కడ మెరుగవడం లేదు. ఆడపిల్లగా పుట్టడమే మేము చేసిన పాపమా అని ఎంతో మంది బాధపడే రీతిలో అనూహ్యమైన ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఏకంగా కామంతో కళ్ళు మూసుకుపోతున్న ఎంతోమంది నీచులు ఆడపిల్ల కనిపిస్తే చాలు దారుణంగా అత్యాచారాలు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.


 దీంతో మహిళా సాధికారతవైపు అడుగులు వేస్తూ ఉద్యోగమో వ్యాపారమో చేసుకుని సొంత కాళ్ల మీద నిలబడాలి అనుకున్న ఆడపిల్లలను కామపు కోరలు వెనక్కి లాగుతూనే ఉన్నాయి. అయితే చివరికి పెళ్లి చేసుకుని ఓ ఇంటి కోడలుగా మారిన తర్వాత కూడా ఆడపిల్లకు వేధింపులు తప్పడం లేదు. అదనపు కట్నం కోసం  అత్తింటి వారు వేధిస్తూ ఉండడంతో ఇలా ఇక కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఎంతో మంది అమ్మాయిలు చివరికి అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 ఇలా అదనపు కట్టపు వేధింపులకు బలవుతున్న ప్రాణాల సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది. ఇక ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగు లోకి వచ్చింది. అత్తింటి వేధింపులు బాధించలేక పోయిన వివాహిత చివరికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరం లోని చిలుకలు కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దివ్య అనే 29 ఏళ్ల యువతి మలక్పేటకు చెందిన అభిషేక్ తో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది. అభిషేక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం తో ఆయనతో కలిసి అమెరికా వెళ్లిన దివ్య అభిప్రాయ భేదాలతో మేలో మళ్ళీ ఇండియా వచ్చేసింది. అత్తింటి వారి నుంచి అదనపు కట్నపు వేధింపులు ఎక్కువ కావడంతో చివరికి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది దివ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: