ఇలా మనిషి తయారు చేసిన మని అదే మనిషిని చివరికి రాక్షసుడిగా మార్చేస్తుంది. ఇది ఎవరో చెప్పడం కాదు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా మారిపోతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పుడు మనిషికి ఏ సమస్య వచ్చినా దానికి సొల్యూషన్ మనీ ఒక్కటి తప్ప ఇంకేమీ లేదు అనే విధంగా పరిస్థితులు కూడా మారిపోయాయి. ఈ క్రమంలోనే ఏకంగా డబ్బులు కోసం ఆస్తుల కోసం సొంత వారిని సైతం దారుణంగా కడ తేరుస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. కాస్తైనా జాలీ దయ అనేది లేకుండా అడవుల్లో ఉండే మృగాల కంటే అత్యంత రాక్షసత్వంతో ప్రవర్తిస్తున్నారు సభ్య సమాజంలో బ్రతికే మనుషులు.
కాగా హైదరాబాద్ రామంతాపూర్ లో ఇలా ఆస్తి ఏకంగా కన్నతల్లిని చంపిన దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనలో కొడుకు అనిల్ తో పాటు కోడలు తిరుమల మరో వ్యక్తి శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు పోలీసులు. ఇల్లు అమ్మేందుకు కొడుకు అనిల్ ప్రయత్నించగా అందుకు తల్లి ఒప్పుకోలేదు. దీంతో చివరికి దారుణంగా తల్లిని కడతేర్చాడు కొడుకు. దిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపేసి ఆ తర్వాత సాధారణ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కానీ బంధువుల ఫిర్యాదు చేయగా.. ఇక పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు నిజం ఒప్పుకున్నారు.