ఇటీవల కాలంలో మనుషులు ఏ కారణంతో ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు అనే ప్రశ్న ఎదురయింది అంటే చాలు ఎక్కువ మంది చెప్పే సమాధానం రోడ్డు ప్రమాదాలు అని. ఎందుకంటే ఏదో రోగం వచ్చి నయం కాక చనిపోతున్న మనుషుల కంటే.. మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న మనుషుల కంటే.. చివరికి వృద్ధాప్యం వచ్చి చనిపోతున్న వారి కంటే ఇలా రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు ఇక ఎవరూ కూడా సేఫ్టీకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.


 రోడ్డు నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తూ చివరికి రోడ్డు ప్రమాదాలకు కారకులుగా మారిపోతున్నారు. కొన్ని కొన్ని సార్లు ఇక డ్రైవింగ్ చేస్తున్నవారు వారి ప్రాణాల మీదకే తెచ్చుకుంటుంటే ఇంకొంతమంది  అభం శుభం తెలియని అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే మరో యాక్సిడెంట్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ఏకంగా యువతి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం కారణంగా ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఇక వైరల్ గా మారిపోయిన వీడియో చూసుకుంటే టీ జంక్షన్ లాంటి ఒక ఇంటర్ సెక్షన్ రోడ్డులో యువతి స్కూటర్ మీద వెళ్లడం చూడవచ్చు. అయితే ఇక ఆమె వెళ్తుంది ఒక పెద్ద హైవే లాగే కనిపిస్తుంది. దానిపై ట్రక్కులు పెద్దపెద్ద లారీలు వేగంగా దూసుకు వెళ్తున్నాయి. అయితే ఇదే  రోడ్డుకు మరోవైపు వెళుతున్న యువతీ సడన్గా టర్నింగ్ తీసుకుంది. దీంతో అప్పటికే మరోవైపు నుంచి దూసుకు వస్తున్న ట్రక్ డ్రైవర్ ఇక యువతి టర్న్ చేస్తుంది అని ఊహించలేకపోయాడు. అయినప్పటికీ బ్రేక్ వేశాడు  కానీ ట్రక్ కంట్రోల్ కాలేదు. దీంతో ఆ ట్రక్ తిరగబడగా.. ఇక దాని కింద ఆ యువతి కూడా పడిపోయింది. ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా అనే కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: