భార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకి కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. ఒక్కసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండాలి. కష్టసుఖాలు ఎన్ని వచ్చినా కూడా నీకు నేనున్నాను అనే భరోసాని ఒకరికి ఒకరు ఇచ్చుకుంటూ ఇక ఎంతో సంతోషంగా సంసార జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. అయితే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కామన్. ఇలాంటి గొడవలు జరిగినప్పుడే వారి బంధం మరింత బలపడుతుంది అని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఎన్నో దారుణాలకు కారణమవుతున్నాయి. ఏకంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కాదు బద్ద శత్రుత్వం ఉందేమో అనే రేంజ్ లో షాకింగ్ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ఎందుకంటే పెళ్లి అనే పవిత్రమైన బంధంతో ఒక్కటైన తర్వాత ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ గొడవలు వచ్చినప్పుడు సర్దుకుపోయి హాయిగా జీవితాన్ని గడపడం మానేసి చిన్న చిన్న గొడవలకే ఈగో లకి పోతు చివరికి సొంత కాపురం లోని చిచ్చు పెట్టుకుంటున ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా ఘటనలతో ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటూ తమ జీవితాన్ని అర్థంతరంగా ముగిస్తున్న  ఘటనలు వెలుగు చూస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. వారిద్దరికీ ప్రేమ వివాహం జరిగింది. ప్రేమ వివాహం అనేసరికి ఎంతో అన్యోన్యంగానే ప్రతి విషయంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు అనుకుంటే పొరపడినట్లే.


 ఎందుకంటే ఇక్కడ ఏకంగా భార్య ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తెలిస్తే ప్రతి ఒక్కరు ముక్కున వేసుకుంటారు.  ప్రేమ పెళ్లి చేసుకున్న జంట కాపురంలో చట్నీ చిచ్చు పెట్టింది. బంజారా హిల్స్ లోని ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు రమణ, చంద్ర దంపతులు. అయితే ఇటీవల డిన్నర్ చేస్తుండగా చట్నీ ఎక్కువ వేసావ్ అంటూ భర్త అలిగాడు. అయితే ఇక మరునాడు ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య ఫోన్ లో గొడవ జరిగింది. దీంతో కావాలని భర్త గొడవ పెట్టుకున్నాడు అని కోపగించుకున్న భార్య.. చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: