
ఎందుకంటే అప్పటివరకు అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో.. ఊహించని ఘటనలు చివరికి ప్రాణాలను తీసేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి ఘటనలు గురించి తెలిసి.. ఇలా కూడా ప్రాణాలు పోతాయా అనే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి కోవలోకి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ప్రతి ఒక్కరూ చికెన్ మటన్ లాంటివి ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ చికెన్ తినడం వల్లే ప్రాణాలు పోతుంది అంటే ఎవరైనా నమ్ముతారా.
కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి ఏకంగా చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఒక ప్రాణం పోయింది. హైదరాబాద్ శివారులోని ఫరూక్నగర్ మండలం ఎలికట్టలో ఈ ఘటన జరిగింది. జార్ఖండ్ వాసి జితేంద్ర ధర్మేందర్ గ్రామంలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే ఇటీవలే రాత్రి చికెన్ తింటూ జితేంద్ర అస్వస్థతకు గురి కావడంతో భయపడిపోయిన ధర్మేందర్ స్థానికులను పిలిచాడు. ఇక వారి సహాయంతో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గొంతులో చికెన్ ముక్క ఇరుక్కోవడం కారణంగా ఊపిరాడక మరణించినట్లు వైద్యులు తెలిపారు.