సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట సంతోషం వెళ్లి విరుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఉద్యోగాలు వ్యాపారాలు నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు సంక్రాంతి పండక్కి సంతూర్లకు చేరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కచోట చేరి ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. పతంగులు ఎగరవేస్తూ కొంతమంది పిండి వంటలను ఆరగిస్తూ ఇంకొంతమంది.. ఇక రంగురంగుల రంగవల్లులు వేస్తూ మహిళలు ఇలా ఒక్కొక్కరు ఒక్కో రీతిలో  సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఊరు వాడ అనే తేడా లేకుండా ప్రతి ఇంట ఆనందం వెలివిరుస్తూ ఉంటుంది. కానీ ఇక సంక్రాంతి పండుగ కూడా కొన్ని కుటుంబాల్లో విషాదం నింపుతూ ఉంది. ఎందుకంటే ఇక చైనా మాంజా కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉండగా.. ఇక మరికొన్ని అనూహ్య ఘటనలు కారణంగా ప్రాణాలు గాల్లో కలిసిపోయి కుటుంబాల్లో విషాదం నిండిపోతూ ఉంది అని చెప్పాలి. ఇక ఇటీవలే పండగ పూట మెహబూబా బాద్ జిల్లాలో కూడా ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.


 ఏకంగా విధి ఆ కుటుంబం ఫై కక్ష గట్టినట్లుగానే వ్యవహరించింది. ఆనందంగా గడపాల్సిన పండగ పూట ఏకంగా రోడ్డు ప్రమాదం రూపం లో చివరికి విషాదం నింపింది. కంబాలపల్లి లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయ పడిన మరో ఏడుగురిని ఆసుపత్రికి తరలించారు. అయితే మృతులు అందరూ కూడా గోడూరు మండలం ఎల్లాపూర్ వాసులుగా అధికారులు గుర్తించారు. వీరు అందరూ కూడా ఓకే కుటుంబానికి చెందిన వారిని మృతుల్లో తల్లి కొడుకు మనవడు మనవరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: