
కానీ నేటి రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భార్యాభర్తల మధ్య తలెత్తుతున్న చిన్న చిన్న గొడవలే చివరికి ఆత్మహత్యలకు హత్యలకు కారణమవుతున్నాయి. ఇక ఎవరో ఒకరు ప్రాణం గాల్లో కలిసిపోయే పరిస్థితులను తీసుకువస్తూ ఉన్నాయి. ఎందుకంటే భార్యాభర్తలు దాంపత్య బంధంలో సర్దుకుపోయే బ్రతకడం మానేసి ఈగోలోకి పోయి చివరికి చిన్న చిన్న గొడవలనే పెద్దదిగా చేసుకొని.. సొంత కాపురంలోనే చిచ్చు పెట్టుకుంటున్నారు. వెరసి ఇక ఆత్మహత్యలు చేసుకుంటూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగానే ముగిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్టలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.
కైలాస్ హిల్స్ లో మణిదీప్ దంపతులు నివాసం ఉంటున్నారు అయితే గత కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇటీవలే మరోసారి గొడవ కావడంతో మనస్థాపానికి గురయ్యాడు భర్త మణిదీప్. ఈ క్రమంలోనే వారు నివాసం ఉంటున్న బిల్డింగ్ పైన నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది అని చెప్పాలి. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.