ఇలా ఎంతోమంది కేటుగాళ్ల మాయలో పడిపోయే మోసపోయిన వారు చివరికి న్యాయం చేయాలి అంటూ ఇక పోలీసులను ఆశ్రయిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇలా ఎవరైనా సినిమా అవకాశాలను ఇప్పిస్తానని మాయమాటలు చెబితే ఇక ప్రతి విషయంలో కూడా ముందు వెనక ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని పోలీసులు కూడా ఎంతో మందికి సూచిస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. అయితే ఇక తెలుగులో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ షోలో అవకాశాలు ఇప్పిస్తాను అంటూ డబ్బు తీసుకొని తన మోసం చేశారని జూబ్లీహిల్స్ పోలీసులకు ఒక వ్యాఖ్యాత ఫిర్యాదు చేశాడు.
ఖమ్మం జిల్లాకు చెందిన అమ్మినేని స్వప్న వ్యాఖ్యాతగా పనిచేస్తున్నారు. బిగ్ బాస్ లోకి వెళ్లాలని ఆమె కలలుగంది ఆమెకు మా టీవీ ప్రొడక్షన్ ఇన్చార్జినని సత్య అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ క్రమంలోనే బంజారా హిల్స్ లోని హయత్ ప్యాలెస్ లో గత ఏడాది జూన్ 7న బిగ్బాస్ షో ఇన్చార్జి అంటూ తమిళ్ రాజును సత్య పరిచయం చేశాడు. బిగ్ బాస్ లోకి రావాలంటే 5 లక్షలు దుస్తులు ప్రచారానికి ఇవ్వాల్సి ఉంటుంది అంటూ తెలిపాడు. అయితే ఇక ఇది గుడ్డిగా నమ్మిన ఆమె పలు దపాలుగా 2.5 లక్షలు అతనికి ఇచ్చింది. తప్పకుండా అవకాశం వస్తుందని అనుకుంది. కానీ రాని పక్షంలో డబ్బులు డిసెంబర్లో తిరిగి ఇస్తానని నమ్మించాడు. అవకాశం రాకపోవడంతో డబ్బులు ఇవ్వమనగా స్పందించలేదు. కాగా కొద్ది రోజుల కిందటే ఆమె ఇదే విషయంపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇంకా పోలీసులను ఆశ్రయించగా జగద్గిరిగుట్టకు చెందిన రాజు పై కేసు నమోదు చేశారు పోలీసులు.