నేటి ఆధునిక సమాజం లో మనిషి జీవన శైలిలో ఎన్నో రకాల మార్పులు వచ్చాయి. ఈ క్రమం లోనే ప్రతి పనిని టెక్నాలజీని ఉపయోగించుకుని సులభతరం  చేసుకుంటున్నాడు మనిషి. ఈ క్రమం లోనే ఇలా టెక్నాలజీ సామాన్యుడికి కూడా సంపన్నుడి లాగా లగ్జరీ లైఫ్ లో ఇచ్చేసింది. ఎందుకంటే ఒకప్పుడు కేవలం సంపన్నులు మాత్రమే తమకు కావాల్సింది పని వాళ్లతో చేయించుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు సామాన్యుడి సైతం అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తో కావాల్సింది ఇక కూర్చున్న చోటికి తెప్పించుకోగలుగుతున్నాడు.


 వెరసి ప్రతి పనిని కూడా సులభతరం చేసుకుంటున్నాడు అని చెప్పాలి. అయితే ఇక నేటి ఆధునిక సమాజంలో మనిషిలో టెక్నాలజీ జ్ఞానం బాగానే ఉన్నప్పటికీ.. ఎందుకో విచక్షణ జ్ఞానం మాత్రం రోజురోజుకు తగ్గిపోతుంది అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే కృంగిపోతూ అక్కడితో జీవితం ముగిసిపోయింది అని బాధపడుతూ చివరికి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు జనాలు. చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగం వ్యాపారం చేసే పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు ఇలా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు.


 చివరికి బలవన్మరణాలకు పాల్పడుతూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగానే ముగిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల ఏపీలోనూ ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. తక్కువ మార్కులు వచ్చాయి అని మనస్థాపనతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. కార్వేటి నగరం మండలం ఈదురు వారి పల్లికి చెందిన పవిత్ర కలికిరి హార్టికల్చర్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే ప్రాక్టికల్స్ లో మంచి మార్కులు రాకపోవడంతో.. మనస్థాపం చెందింది పవిత్ర. దీంతో ఆమె ఉంటూన్న హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె సూసైడ్ నోట్ రాసినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: