ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మృగాలా అన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు సాటి మనుషులకు ఏ చిన్న సమస్య వచ్చినా అయ్యో పాపం అంటూ జాలిపడి ముక్కు ముఖం తెలియని వారికి కూడా సహాయం చేసేవాడు మనిషి. ఇక ఎంతో మానవత్వంతో వ్యవహరించేవాడు. కానీ ఇటీవల కాలంలో ఇలాంటి మానవత్వం మనుషుల్లో ఎక్కడ కనిపించడం లేదు.


 సాటి మనుషులపై ఎలా కక్ష తీర్చుకోవాలి అని ఆలోచించే మనుషులే నేటి రోజుల్లో కనిపిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా చాక్లెట్ తిన్నంత ఈజీగా మనిషి ప్రాణాలను గాల్లో కలీపేస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. ఏకంగా ఒక మహిళ తనతో మాట్లాడటం మానేసింది అన్న కారణంతో దారుణానికి ఒడిగట్టాడు ఇక్కడ ఒక వ్యక్తి..


 ఏకంగా మహిళ తనతో మాట్లాడటం మానేసింది అనే కోపంతో పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఒకరోజు  చివరికి ఇంటిని తగలబెట్టాడు. బయటికి వెళ్లిన మహిళ మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. అయితే సదరు మహిళ బర్త్ డే పార్టీకి వెళ్ళిన సమయంలో నిందితుడు తరుణ్ దకేటా అనే 32 ఏళ్ల వ్యక్తి తాలాన్ని పగలగొట్టి ఆమె ప్లాట్ లోపలికి చొరబడ్డాడు. ఈ క్రమంలోనే ఫ్లాట్లో నిప్పు అంటించి పరారయ్యాడు. ఇక సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: