ముస్లింలకు ఎవరైనా ఎదురు తిరిగితే ఏకంగా దైవ దూషణ పేరుతో వారిని జైల్లో పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక హిందూ ఆలయాలను కూడా అక్కడ ధ్వంసం చేయడం.. ఎన్నో రోజులుగా కొనసాగుతూనే వస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఏకంగా హిందూ యువతులపై జరుగుతున్న దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయట. ఎవరైనా హిందూ యువతి ఒంటరిగా కనిపించింది అంటే చాలు ఆమెను అపహరించి.. ఇక ఇస్లామిక్ చట్టం ప్రకారం వివాహాలు చేసుకుంటున్నారట. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఏకంగా తల్లిదండ్రులను కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారట. ఏకంగా మత పెద్దలను ఆశ్రయించిన కూడా నికా పూర్తయింది తర్వాత ఏం చేయలేము అని చేతులెత్తేస్తున్నారు.
ఇక ఇటీవల ఇలాంటి తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా 17 ఏళ్ల సాందియా అనే అమ్మాయిని టాడో ఆడం సింద్ అనే ప్రాంతంలో బలవంతంగా అపహరించి వివాహం చేసుకున్నరట ఇస్లామిక్ యువకుడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చి సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే తమకు న్యాయం చేయాలి అంటూ అమ్మాయి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారట. అయితే అంతకుముందే అటు వివాహం చేసుకున్న ఇస్లామిక్ యువకుడి కుటుంబ సభ్యులతో పాటు మత పెద్దలను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోవడంతో కోర్టులో న్యాయం జరుగుతుందని కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరి ఈ ఘటనపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్నది చర్చనీయాంశంగా మారింది.