ఇలా రెస్టారెంట్ కు వెళ్ళిన కస్టమర్లు తమ తాహతకు తగ్గట్లుగా తమకు నచ్చిన విధంగా టిప్ ఇవ్వడం చూస్తూ ఉంటాం. కొంతమంది మాత్రం ఏకంగా చేసిన బిల్లు కంటే టిప్పే ఎక్కువగా ఇవ్వడం లాంటిది చేస్తూ ఉంటారు. ఇలాంటిది ఏదైనా జరిగింది అంటే చాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఇక ఇలాంటి ఘటన గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా కొంతమంది వేల రూపాయల బిల్లు చేసి లక్షల రూపాయల టిప్ చెల్లించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు ఇలాంటివి చూసినప్పుడు వీరి దగ్గర ఏమైనా డబ్బులు ఎక్కువగా ఉన్నాయా ఏంటి అనే భావన అందరికీ కలుగుతూ ఉంటుంది.
ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేశాడు. ఏకంగా వేలల్లో బిల్లు చేసి ఎనిమిది లక్షల టిప్ ఇచ్చాడు. అమెరికాలో ఈ విచిత్రమైన ఘటన జరిగింది అని చెప్పాలి. మిచిగాన్ రెస్టారెంట్లో భోజనం చేయడానికి వెళ్ళాడు ఒక కస్టమర్. ఇక తనకు కావలసిన ఆహారాన్ని తెప్పించుకొని హాయిగా ఆరగించాడు. అయితే బిల్లు కట్టే సమయంలో అతను చేసిన పని మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఏకంగా పదివేల డాలర్లు టిప్పుగా ఇచ్చాడు. మార్క్ అనే వ్యక్తి రెస్టారెంట్లో 32.43 డాలర్ అంటే 2000 విలువైన ఫుడ్ తిన్నాడు. బిల్లు కట్టే సమయంలో మాత్రం మరణించిన స్నేహితుడి గౌరవార్థం ఏకంగా ఎనిమిది లక్షల టిప్ ఇచ్చి అక్కడ ఉన్న సిబ్బంది అందరిని కూడా ఆశ్చర్యపరిచాడు అని చెప్పాలి. ఈ విషయం తెలిసి నేటిజన్స్ సైతం షాక్ అవుతున్నారు.