స్కూల్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. ఇక పాఠశాల దశలో కలిసిన స్నేహితులు జీవితాంతం గుర్తుండిపోతూ ఉంటారు. ఎంత ఉన్నత స్థానానికి ఎదిగిన ఇక చిన్నప్పటి ఫ్రెండ్స్ ఒకసారి గుర్తుకు వచ్చారంటే ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా స్కూల్ డేస్ లో స్నేహితులు ఇక ఒకరి హోంవర్క్ ని ఒకరు చేసి ఇవ్వడం చేస్తూ ఉంటారు. ఇక్కడ తనకు చిన్నప్పుడు హోం వర్క్ చేసిన తన స్నేహితురాలని ఒక వ్యక్తి బాగా గుర్తుపెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే పెద్దయిన తర్వాత ఆమెకు ఒక భారీ బహుమతి ఇచ్చాడు.


 ఆ యువతికి సరిబ్రల్ పారాసీ అనే అనారోగ్య సమస్య ఉంది. దీంతో చిన్నప్పటినుంచి ఆమెను తన కండరాలపై కంట్రోల్ ఉండేది కాదు. తోటి విద్యార్థులు ఆమెను నిత్యం వేధించేవారు కొన్ని సంవత్సరాలు పాటు ఆమె జీవితం ఇలాగే గడిచింది. ఇంతలో అదే స్కూల్లోకి ఒక అబ్బాయి వచ్చాడు. ఇక అందరూ అతనితో స్నేహం చేయడం మొదలుపెట్టారు. అయితే విద్యార్థులు సదరు విద్యార్థినిని ఏడిపించినప్పుడల్లా అతను వచ్చి అడ్డుకునేవాడు. దీంతో అతను ఆడకపోయిన ఆమె హోంవర్క్ రాసి ఇవ్వడం మొదలుపెట్టింది. చూస్తుండగానే స్కూల్ చదువులు పూర్తయ్యాయ్. ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు.


 అనారోగ్య సమస్య మాత్రం ఆమెను విడలేదు. అంతలోనే కుర్రాడు లైఫ్లో సక్సెస్ అయ్యాడు. వ్యాపారవేత్తగా మారి మిలియన్ల కొద్ది డబ్బు సంపాదించాడు. ఇంతలో స్కూల్లో కలిసిన ఈ స్నేహితులు మళ్లీ సోషల్ మీడియా ద్వారా కలుసుకున్నారు. యువతకి ఇల్లు కారు అన్ని కొనిచ్చేందుకు ముందుకు వచ్చాడు. కానీ ఆమె మాత్రం ఇందుకు అంగీకరించలేదు. దీంతో యువతికి స్థానికంగా ఉన్న ప్రముఖ ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. ఆమె చికిత్స కోసం మూడేళ్లకు సరిపడ డబ్బును స్నేహితుడా చెల్లించాడని.. ఆసుపత్రికి వస్తే ట్రీట్మెంట్ ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో మనసులో మొహమాటం ఉన్న.. అనారోగ్యం తాలలేని ఆమె ఆసుపత్రికి వెళ్ళింది  ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా నీ స్నేహితుల స్టోరీ అందరి మనసును హత్తుకునేలా ఉంది అని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: