ఏకంగా అవసరాలు తీర్చుకునేందుకు ప్రేమ అనే ముసుగు వేసుకొని ఎంతో మంది నటిస్తున్నారు. ఇక అవసరం తీరిన తర్వాత ముసుగు తీసేసి చివరికి ప్రేమించిన వారిని మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి లవ్ స్టోరీలకు సంబంధించిన ఘటనలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. ఇక మధ్య మధ్యలో కొన్ని వింతైన లవ్ స్టోరీస్ కూడా అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి వింతైన లవ్ స్టోరీ గురించే. ఆ ఇద్దరు అబ్బాయిలు. ఏకంగా ప్రేమించుకున్నారు. ఆగండి ఆగండి.. లవ్ స్టోరీ అన్నారు మరి ఇద్దరూ అబ్బాయిలు ప్రేమించుకోవడం ఏంటి అని అంటారా.
పూర్తిగా వింటే మీకు క్లారిటీ వస్తుంది బాసూ.. ఏకంగా ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే స్నేహితున్ని పెళ్లి చేసుకునేందుకు యువకుడు ఏకంగా లింగమార్పిడి సర్జరీ చేయించుకునేందుకు కూడా రెడీ అయ్యాడు కానీ ఆపరేషన్ చేసుకున్న తర్వాత చివరికి మోసపోయాడు. మధ్యప్రదేశ్ కు చెందిన 28 ఏళ్ల బాధితుడికి సోషల్ మీడియాలో శుక్ల అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వీరి మధ్య ప్రేమ చిగురించడంతో శుక్లాని పెళ్లి చేసుకోవాలనుకునే యువకుడు సర్జరీతో మహిళగా మారిపోయాడు. ఆ తర్వాత అసహజ శృంగారానికి పాల్పడ్డ శుక్ల తర్వాత పెళ్లికి మాత్రం నిరాకరించాడు. దీంతో మోసపోయాను అని గ్రహించి పోలీసులను ఆశ్రయించిన సదరు యువకుడు న్యాయం చేయాలంటూ కోరాడు.