చాయ్ తాగాలి అనే సరదా ప్రాణాలు తీయడం ఏంటి అని టైటిల్ చూడగానే కాస్త షాక్ లో మునిగిపోయారు కదా.. మేము ప్రతిరోజు కూడా టీ తాగుతూనే ఉంటామూ.. అలా ఎలా ప్రాణం పోయింది అని అనుకుంటున్నారు కదా. అయినా టీ తాగడం వల్ల ప్రాణాలు పోవడం ఏంటి అని ఆశ్చర్యం వేస్తుంది కదా. అయితే ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇంకోసారి టీ కోసం సరదా పడి రిస్క్ చేయాలని అసలు అనిపించదు. ఒకవేళ రిస్క్ చేస్తే ఎంత దారుణంగా ప్రాణాలు పోతాయి అన్నది ఇక్కడ ఘటన గురించి తెలిస్తే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.


 అందరి స్నేహితుల్లాగానే ఆ ముగ్గురు స్నేహితులకు కూడా సరదాగా టీ తాగాలి అని అనిపించింది. అయితే ఇంట్లో పెట్టుకుని టీ తాగితే కిక్ ఏమంటుంది ఎక్కడ దూర ప్రాంతంలోకి వెళ్లి చాయ్ తాగితే ఆ కిక్కే వేరు అనుకున్నారు ఆ ముగ్గురు. కానీ వెళ్లే దారిలోనే వారికోసం మృత్యువు వేచి చూస్తుంది అని మాత్రం ఊహించలేకపోయారు. చివరికి టీ సరదా తమ తల్లిదండ్రులకు కడుపు కోతను మిగులుస్తుంది అని మాత్రం ఆలోచించలేకపోయారు. ఇక ఇలాంటి టీ సరదానే చివరికి వారి జీవితాన్ని అర్థంతరంగా ముగిసిపోయేలా చేస్తుంది గాని అర్థం చేసుకోలేకపోయారు.



 చివరికి టీ సరదా వారి ప్రాణాలను గాల్లో కలిపేసింది. సంగారెడ్డి జిల్లాలో దారుణమైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది  అందోల్ మండలం మాసన్ పల్లి శివారులో  నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శివారులోని సర్వీస్ రోడ్డుపై ఆగి ఉన్న కారణం అతివేగంతో వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే జోగిపేటకు చెందిన యువకులు మెగ్గురం 22, హాజీ 26, వాజీద్ 28 మృతి చెందారు. అయితే అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జోగిపేటకు చెందిన ఆరుగురు యువకులు టీ తాగేందుకు కారులో బయటికి వచ్చారు  చౌటుకూరు దాబాకు వెళ్లారు. అక్కడ దాబా మూసి ఉండడంతో అదే కారులో మాసన్ పల్లి వద్ద హైవే పక్కన హోటల్ వెళ్లి టీ తాగారు తిరిగి వెళుతూ టాయిలెట్ కోసం ఒక వంతెన వద్ద దిగారు. ఇక ఆ సమయంలోనే టిప్పర్ లారీ అతి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: