నేటి రోజుల్లో కోట్లాదిమంది జనాలు అటు రైల్వే ద్వారా ప్రయాణాలు సాగిస్తూ ఉన్నారు అని విషయం తెలిసిందే. అయితే సుదూర ప్రాంతాలకు వెళ్లాలి అనుకునేవారు ఇక రైల్వే ప్రయాణాలవైపు ఎక్కువగా ముగ్గు చూపుతున్నారు. రైలులో ప్రయాణిస్తే అటు సురక్షితమైన ప్రయాణంతో పాటు అతి తక్కువ ఖర్చుతోనే గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తూ ఉంటారు. ఇక కొంతమంది అయితే రోజు వారిజీవితంలో రైలు ప్రయాణం అనేది సర్వసాధారణంగా కొనసాగుతూ ఉంటుంది. అయితే తరచూ ఇలా రైలు ప్రయాణాలు చేసే వారు ఓకే గాని కొత్తగా రైలు ఎక్కే వారు మాత్రం ప్రయాణాలు చేసే సమయంలో కాస్త కన్ఫ్యూషన్ కి గురవుతూ ఉంటారు.


 తాము ఎక్కాల్సిన ట్రైన్ ఎక్కడికి వచ్చి ఆగుతుంది. ఇక ట్రైన్ వచ్చిన తర్వాత ఎక్కడ కూర్చోవాలి. ఏ భోగిలోకి ఎక్కాలి అనే విషయంపై కొత్తగా ట్రైన్  ఎక్కిన వాళ్ళు ఎంతగానో కన్ఫ్యూషన్ అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలాంటి వారికి టికెట్లను చెక్ చేయడానికి వచ్చిన టీటీఈలు మాత్రం ఇక మార్గదర్శకాలు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. అదే సమయంలో కొంతమంది టీటీఈలు మాత్రం ప్రయాణికుల విషయంలో అత్యంత దారుణంగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.


 తెలియక ఒక మహిళ ప్రయాణికురాలు చేసిన పనికి టిటిఈ ఏకంగా ఆమె ప్రాణాలు తీసినంత పని చేశాడు. హర్యానా లోని ఫరీదాబాద్ లో ఈ దారుణ ఘటన జరిగింది. జనరల్ టికెట్ తీసుకున్న భావన దేవి అనే 47 ఏళ్ళ మహిళ ఏసీ కోచ్ లోకి ఎక్కారు. అయితే ఆమెను దిగమని టీటీఈ చెప్పాడు. కానీ అప్పటికే రైలు కదిలింది. తర్వాత స్టేషన్లో దిగుతానని. పొరపాటున ఇదంతా జరిగింది అంటూ ఆమె సంజాయిషి ఇచ్చింది. కావాలంటే ఫైన్ చెల్లిస్తానని ఆమె వేడుకంది. అయినప్పటికీ వీనని టీటీఈ ఆమెను రైలు నుంచి తోసేసాడు. దీంతో కోచ్ ప్లాట్ఫామ్ మధ్య ఆ మహిళ ఇరుకుంది. ఇక ఆమె కూతురు అప్రమత్తం కావడంతో చివరికి ఆమెను ప్రాణాలతో రక్షించుకోగలిగారు. అయితే టీటీఈ పై కేసు నమోదు కాగా ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: