ప్రేమ గుడ్డిది అని అంటూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చే ఘటనలు చూసిన తర్వాత ప్రేమ గుడ్డిది అని తెలుసు. కానీ మరి ఇంత గుడ్డిది అని మాత్రం అసలు అనుకోలేదు అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ పుట్టడం చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఇద్దరు అమ్మాయిల మధ్య లేదంటే ఇద్దరు అబ్బాయిల మధ్య ప్రేమ పుడుతుంది. ఇక ఈ ప్రేమ ఎన్నో వింతైన ఘటనలకు కూడా కారణం అవుతూ ఉంది అని చెప్పాలి. తమ ప్రేమను గెలిపించుకోవడానికి చేయకూడని పనులన్నీ చేసేస్తూ ఉన్నారు అబ్బాయిలు, అమ్మాయిలు.


 ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా ఇద్దరు అబ్బాయిల మధ్య అసహజమైన ప్రేమ పుట్టింది. కానీ తమ ప్రేమను ఎలాగైనా గెలిపించుకోవాలని ఆ ఇద్దరు అబ్బాయిలు అనుకున్నారు. ఇక ఇద్దరిలో ఒక అబ్బాయి ఏకంగా ప్రేమించిన మరో అబ్బాయి కోసం లింగమార్పిడి చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యాడు. భారీగా ఖర్చుపెట్టి మరి లింగ మార్పిడి చేసుకున్నాడు. కానీ ఇలా ఏకంగా లింగ మార్పిడి చేసుకొని ప్రేమను గెలిపించుకోవాలనుకున్న అమ్మాయిగా మారిన అబ్బాయికి చివరికి చేదు అనుభవం ఎదురయింది. ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


 కాన్పూర్, ఇండోర్ ప్రాంతాలకు చెందిన ఇద్దరు అబ్బాయిలకు సోషల్ మీడియాలో పరిచయం అయింది. ఈ క్రమంలోనే పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ప్రేమించుకుని చివరికి పెళ్లి చేసుకొని ఒకటి అవ్వాలి అనుకున్నారు  దీంతో ఇద్దరిలో ఒక అబ్బాయి చేయకూడని త్యాగం చేశాడు. ఏకంగా పెళ్లి చేసుకోవాలి అని భావించి కోటి రూపాయలు ఖర్చు చేసి లింగమార్పిడి చేయించుకున్నాడు. అక్కడే చివరికి అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది  లింగమార్పిడి పూర్తయిన తర్వాత అబ్బాయిని ప్రేమించిన వాడు చివరికి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో మోసపోయానని తీవ్ర ఆగ్రహానికి లోనైన బాధితుడు ప్రియుడి కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: