అయితే నేటి రోజుల్లో ఇలా దాంపత్య బంధంలో మాత్రం కాస్త అన్యోన్యత కరువైందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్నచిన్న కారణాలతోనే ఎంతో మంది విడిపోవడానికి సిద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు.. వారి బంధం మరింత బలపడుతుంది అని అంటూ ఉంటారు. ఎందుకంటే గొడవలు వచ్చి భార్య అలక భూనినప్పుడు భర్త బ్రతిమిలాడితే ఇక వారి మధ్య ఉన్న ప్రేమ మరింత పెరుగుతుంది అని అంటూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో ఈ చిన్న గొడవలే చివరికి విడాకులు తీసుకుని విడిపోవడానికి కారణం అవుతున్నాయి.
అయితే ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన గురించి చెబుతే ప్రతి ఒక్కరు కూడా నోరెళ్ళ పెట్టడం ఖాయం అని చెప్పాలి. భార్యాభర్తలు ఏకంగా లిప్ స్టిక్ కారణంగా విడాకులకు రెడీ అయ్యారూ. ఆగ్రాకు చెందిన ఒక మహిళ ₹10 లిప్ స్టిక్ తీసుకురమ్మని భర్తకు చెప్పింది. అతనికేమో భార్య పైన ప్రేమ. చీప్ లిప్ స్టిక్ ఎందుకని ఏకంగా 30 రూపాయల విలువ చేసే లిప్ స్టిక్ తీసుకొని వెళ్ళాడు. అది చూసినా ఆమె ఆగ్రహిస్తూ చౌక ధరలో ఎందుకు తీసుకురాలేదు అని గొడవ పడింది. తర్వాత విడాకుల కోసం పోలీసులును ఆశ్రయించింది. పోలీసులు కూడా ఆమె చెప్పిన కారణం విని షాక్ అయ్యారూ. చివరికి ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.