మొన్నటి వరకు కరోనా వైరస్ ప్రపంచ దేశాలలో ప్రకంపనలు సృష్టించింది. ఏ క్షణంలో ప్రాణాలు పోతాయో కూడా చెప్పలేని విధంగా మారిపోయింది పరిస్థితి. అయితే కరోనా కాలం గడిచిపోయింది అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఇక ఇప్పుడు గుండెపోట్లు అందరిలో ప్రాణాపాయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. కరోనా కాలం తర్వాత ఈ గుండెపోట్ల సంఖ్య మరింత ఎక్కువైపోయింది అని చెప్పాలి. ఒకప్పుడు గుండెపోటు వచ్చిన సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకువెళ్తే ప్రాణాలను కాపాడవచ్చు అని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు గుండెపోటు వచ్చింది అని అర్థం చేసుకునే లోపే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.



 చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరిని కూడా ఈ సడన్ హార్ట్ ఎటాకులు అస్సలు వదలడం లేదు. అప్పటివరకు ఎంతో సంతోషంగా ఉన్నవారు ఒక్కసారిగా కృప కూలిపోతున్నారు. ఏం జరిగిందో అని పక్క వాళ్ళు చూసే లోపే చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పాలి. దీంతో ఇలా గుండెపోటుకు గురైన వారిని కాపాడేందుకు అవకాశం లేకుండా పోతుంది అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా ఘటనలు ఇటీవల కాలంలో తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో కూడా ఇలాంటి ఒక హృదయ విదారక ఘటన జరిగింది.


 హన్స్ వాహిని స్కూల్లో రెండో తరగతి చదువుతున్న విద్యార్థి చంద్రకాంత్ చివరికి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. స్కూలు ప్రాంగణంలో ఆడుకుంటూ చంద్రకాంత్ ఒక్క సరిగా కుప్పకూలిపోయాడు. అయితే సరదాగా అలా చేసి ఉంటాడు అని మిగతా విద్యార్థులు అందరూ కూడా అనుకున్నారు. కానీ అతను ఎంతకీ లేవకపోవడంతో అతన్ని లేపే ప్రయత్నం చేశారు అతను స్పృహ కోల్పోవడంతో వెంటనే టీచర్లకు సమాచారం.  టీచర్లు ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది. గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: