ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తనయుడు అయిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ గురించి చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మార్చ్ ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిరథ మహారధులు అందరూ కూడా హాజరయ్యారు. ఏకంగా వేలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఈ వేడుకను నిర్వహించాడు ముఖేష్ అంబానీ. అయితే ఇక సినీ స్టార్స్ అందరూ కూడా ఈ ఈవెంట్లో ప్రత్యక్షం కావడంతో.. ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అటు దేశంలోనే హాట్ టాపిక్ గా మారిపోయాయి.



 అయితే జూలై 12వ తేదీన ఆనంద్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుక జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రీ వెడ్డింగ్ వేడుకనే కన్నుల పండుగ నిర్వహించిన ముఖేష్ అంబానీ కుటుంబం ఇక పెళ్లి వేడుకను ఎలా నిర్వహించబోతున్నారు అనే విషయంపై కూడా అందరి అంచనాలు తారాస్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇక ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి వేడుకకు సంబంధించి ఎన్నో వార్తలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఏకంగా ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత్ అంబానీ ఏకంగా జియో యూజర్స్ అందరికీ కూడా ఒక బంపర్ ఆఫర్ ప్రకటించాడు అంటూ ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక జూలై 12వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో జియో నుంచి ఏకంగా 259 రూపాయల రీఛార్జ్ ను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారని.. ఇది 30 రోజుల వాలిడిటీ ఉంటుందని ఒక ప్రచారం జరుగుతుంది. అయితే మూడు రోజుల్లోనే ఇక ఇందుకు సంబంధించిన గడువు ముగుస్తుందని.. ఇక లింక్ పై క్లిక్ చేసి బెనిఫిట్స్ పొందాలి అంటూ కొన్ని లింక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అయితే ఇక ఇందుకు సంబంధించిన న్యూస్ కాస్త అటు పోలీసుల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే అపరిచిత లింక్స్ ఫై క్లిప్ చేసి ప్రమాదంలో పడిపోవద్దు అంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదంతా ఫేక్ అంటూ తేల్చి చెప్పారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: