
ఏకంగా కారులో వెళ్తున్న సమయంలో కారు టైరు పంచర్ కావడంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలోనే టైర్ పంచర్ చేయడానికి ప్రయత్నించాడు. ఇంతలో ఊహించనీ రీతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. చివరికి ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయ్. ఏకంగా వేగంగా దూసుకు వచ్చిన మరో కారు ఇలా రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఉంటే ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. హర్యానాలోని రేవారి ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
సాని గ్రామంలో గవర్నమెంట్ పాఠశాల దగ్గర కొంతమంది రోడ్డు పక్కన కారు ఆపి టైర్ పంచర్ అయింది అన్న విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలోనే టైర్ మార్చేందుకు ప్రయత్నిస్తుండగా.. ఇక చీకట్లో మరోవైపు నుంచి వేగంగా మృత్యువు కారు రూపంలో తీసుకువచ్చింది. అయితే అప్పటికే రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారును గమనించకుండా దానిని ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో నలుగురు మహిళలు ఇద్దరు పురుషులు ఉన్నారూ. ఢిల్లీలోని కత్తు విలేజ్ నుంచి కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.