అయితే ప్రస్తుతం కరోనా వైరస్ పై పోరాటం చేసి కాస్త ఉపశమనం పొందాము అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో.. సడన్ హార్ట్ ఎటాక్లు మరోసారి ప్రాణ భయాన్ని కలిగిస్తున్నాయ్. ఇవన్నీ చాలవు ఉన్నట్లు ఎప్పటిలాగానే సీజన్ వ్యాధులు అయిన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటివి కూడా ప్రాణాలను తీసేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. మరి కొన్ని కొత్త వ్యాధులు కూడా ముంచుకొస్తూ ఎంతో మందిని మృత్యువు ఒడిలోకి చేరుస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల కేరళలో ఒక కొత్త వ్యాధి కలకలం రేపుతుంది. ఓకే రోజు ఏకంగా 190 కేసులు వెలుగులోకి రావడం ఆందోళనకరంగా మారిపోయింది. ఈ కొత్త వ్యాధి ఏదో కాదు మంమ్స్.
అదేనండి గవద బిళ్ళలు. కేరళలో గవద బిల్లల వ్యాధికి సంబంధించిన కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో అక్కడ ఏకంగా 11 వేలకు పైగా కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే రోగనిరోధక వ్యవస్థపై ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతుంది అన్న విషయం తెలిసిందే. పారా మిక్సో వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తూ ఉంటుంది నోటి తుంపర్ల ద్వారా ఇది వ్యాపిస్తూ ఉంటుంది అని చెప్పాలి . జ్వరం తలనొప్పి అలసట లాలాజల గ్రందుల్లో వాపు ఇక ఈ వ్యాధి లక్షణాలు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. మాస్కులు ధరించడం చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ద్వారా.. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తూ ఉన్నారు.