
వరుడు కంటనీరు పెట్టుకోవడం ఏంటి అయినా వరుడు ఏడవడానికి ఏమంటుంది అనుకుంటారు ఎవరైనా. కానీ ఇక్కడ పెళ్లిలో మాత్రం పెళ్లి తంతు జరుగుతుండగా వరుడు కంటనీరు పెట్టుకున్నారు. అయితే ఇది గమనించిన డాక్టర్ వధువు అనుమాన వ్యక్తం చేసింది. చివరికి అతని అనుమానమే నిజమైంది. హరియాణాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మంహిందర్ ఘడ్ ప్రాంతానికి చెందిన ఒక వైద్యురాలికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. అయితే పెళ్లి రోజున సాంప్రదాయ పద్ధతిలో వరుడు ఊరేగింపుగా మండపానికి వచ్చాడు. అయితే వధువు బంధువుల దృష్టి మొత్తం ఒక యువతిపై పడింది.
ఎందుకంటే ఓ యువతి నిత్యం వరుడు పక్కనే ఉండడంతో.. వధువు కుటుంబ సభ్యుల్లో ఎన్నో అనుమానాలు వచ్చాయి. ఆమె ఎవరు అని ఇక వాళ్ళని వీళ్ళని అడగడం కూడా మొదలుపెట్టారు. అయితే ముహూర్తం దగ్గర పడుతున్న కొద్ది వరుడు మొహంలో ఎంతో చేంజ్ కనిపించింది. చివరికి కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. ఇంతలోపే వధువు బంధువులు ఎంక్వయిరీ చేయగా.. ఆమె వరుడి గర్ల్ ఫ్రెండ్ అని తేలింది. ఇక పెళ్లి తంతు పూర్తవుతుండగా.. వరుడుతో పాటు ఆ యువతీ కూడా కన్నీరు పెట్టుకుంది దీంతో వధువుకి కోపం నషాలానికి అంటింది. ఇక అక్కడే వేదికపై వరుడుని నిలదీయడమే కాదు పెళ్లి కూడా రద్దు చేసుకుంది వధువు. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది.